
- ఘనంగా రాయల్ యోగ మరియు మార్షల్ ఆర్ట్స్ అకాడమి మొదటి వార్షిక దినోత్సవ వేడుకలు
హైదరాబాద్, ఏప్రిల్ 24 (విశ్వం న్యూస్) : ఘనంగా రాయల్ యోగ మరియు మార్షల్ ఆర్ట్స్ అకాడమి వార్షిక దినోత్సవ వేడుకలు హైదరాబాద్ రాయల్ గార్డెన్ లో నిర్వంచారు. సభకు అధ్యక్షత వహించిన డా. గూడూరి చెన్నారెడ్డి గారు మాట్లాడుతూ యోగా ఒక పరిపూర్ణమైన ఆధ్యాత్మిక రూపం. వ్యాయామ సాధనల సమాహారం. హిందుత్వ ఆధ్యాత్మిక సాధనలలో ఒక భాగం. మోక్ష సాధనలో భాగమైన ధ్యానం, అంతఃదృష్టి, పరమానంద ప్రాప్తి లాంటి ఆధ్యాత్మిక సాధనలకు యోగానే పునాది. మునుల నుంచి సామాన్యుల దాకా అందరికీ యోగా అవసరమే. యోగాసనాలు మానసిక ఆరోగ్యానికి చక్కగా తోడ్పడుతాయి. శారీరకంగానూ ప్రయోజనాలు అనేకం. బౌద్ధ, జైన, సిక్కు వంటి ధార్మిక మతాలతోపాటు ఇతర ఆధ్యాత్మిక సాధనల్లోనూ యోగా ప్రాధాన్యత కనిపిస్తుంది.
ప్రస్తుత సమాజంలో మానవుల యొక్క మనుగడ ప్రశ్నార్థకంగా మారిపోయింది. మనిషి బ్రతకాలంటే స్వచ్ఛమైన గాలి, నీరు, తిండి, మందులు, చివరగా వైద్యం కూడా సరైన, సమయానికి అందుబాటులో లేని స్థితి మనకు ఏర్పడింది అనడంలో సందేహం లేదు. అలాగే మరి ముఖ్యంగా మహిళలు సంఘంలో గౌరవంతో తల ఎత్తుకొని తిరిగే పరిస్థితులు ఆగుపడడం లేదు, ఆడపిల్లలు ఇంటి నుంచి బయటికి వెళ్లి ఇంటికి వచ్చే సమయానికి వారి కుటుంబ సభ్యులు పడుతున్న బాధలు అంతా ఇంతా కాదు.
ఈ మధ్యకాలంలో చాలా చిత్ర విచిత్రమైన సంఘటనలు చిన్నారులను మొదలుకొని మహిళల వరకు అగత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వం, ప్రభుత్వాధికారులు, సంఘ సేవకులు మొదలగు వారు నివారించే టందులకు ఎంత ప్రయత్నం చేసినప్పటికీని పూర్తిగా నివారించే పరిస్థితి అగుపడడం లేదు కనుక చిన్నతనం నుండే బాలబాలికలు మానసిక స్థితి, దేహదారుఢ్యం పెంపొందించుకొని సుఖమైన జీవితం గడపటానికి యోగ, మార్షల్ ఆర్ట్స్ అనేటివి ముఖ్యమైన అని తన అభిప్రాయం తెలియజేశారు.
స్నేహితం ట్రస్ట్ చైర్ పర్సన్ చింతపల్లి శోభా రెడ్డి గారు తన వంతు బాధ్యతగా బాలిక దశ నుండే వారికి సెల్ఫ్ ప్రొటెక్షన్ క్రింద యోగ విద్యలు నేర్పినట్లయితే కొంతలో కొంతైనా ఎలాంటి విపత్కర పరిస్థితులను స్వతగా ఎదుర్కొనే నిలబడే ధైర్యము వారికి కల్పించాలని కేవలం మహిళా ట్రైనర్ల ద్వారానే బాల బాలికలకు యోగ విద్యతోబాటు మార్షల్ ఆర్ట్స్ లో విద్యను బోధించడం తద్వారా రాబోవు తరాలకు ఒక మంచి యూత్ ని తయారు చేయాలని ఉద్దేశంతో చేపట్టిన సమస్త రాయల్ యోగ మరియు మార్షల్ ఆర్ట్స్ అకాడమి గూడూరి ఫౌండేషన్, స్నేహితం ట్రస్ట్ ల సౌజన్య వాళ్ళతో నిర్వహిస్తున్నామన్నారు.
యోగ మార్షల్ ఆర్ట్ లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు శ్రీమతి లక్ష్మీ శ్వర సామ్రాజ్యం చేతుల మీదుగా బహుమతులుకు ప్రధానం చేయడం జరిగింది. BK.గూడూరి విజయలక్ష్మి గూడూరి ఫౌండేషన్ కోశాధికారిణి పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీమతి లక్ష్మి సామ్రాజ్యం, రుద్రమదేవి ఫౌండేషన్ ఫౌండర్ అదినేత్రి,షీ టీం కోచ్. పిల్లల్లో చిన్నప్పటినుండే అదీను ఆడపిల్లలకు యోగ విద్యతోపాటు మార్షల్ ఆర్ట్స్ నేర్పడం అనేది ప్రస్తుత సమాజానికి చాలా అవసరమని, విపత్కర పరిస్థితుల్లో తమకు తాముగా రక్షించుకొనుటకు ఈ విద్యలు ఎంతగానో దోహదం పడతావని, ఈ రాయల్ యోగ అండ్ రాయల్ ఆర్ట్ ను నిర్వర్తిస్తున్న యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సమావేశము కొచ్చిన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలుపుకున్నారు.
ఇప్పుటి నుంచి మీ పిల్లలను యోగ విద్యలో శిక్షణ నేర్పించడం ప్రతి తల్లిదండ్రులు ప్రతిష్టంగా తీసుకొని తమ పిల్లలను సక్రమమైన మార్గంలో నడిపించుటకు మీరే మార్గదర్శకులు అవుతారు కనుక మీరు తీసుకొని నిర్ణయం చక్కటి నిర్ణయం అని అభివర్ణించారు. మా సంస్థ తరపు నుండి కూడా మీకు వీలైన సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు.
ప్రత్యేక ఆహ్వానితులుగా శ్రీమతి డాక్టర్ పద్మ వీరపనేని, సోషల్ యాక్టివిస్ట్ బిజెపి. శ్రీ లంకా దీపక్ రెడ్డి, బిజెపి ప్రముఖ నాయకులు మాట్లాడుతూ ఈ సమస్త వారు తీసుకున్న నిర్ణయం స్లాగనీయం అని పొగిడారు. మేము రాష్ట్రంలో ఎన్నో మీటింగ్లో పాల్గొంటూనే ఉంటాము కానీ ఇక్కడ వాతావరణం చూసిన తర్వాత నేను ఎంతగానో మనోవికాసం పొందగలిగానని ఇలాంటి కార్యక్రమాలు సంస్థ వారు చేయడం స్లాగించదగినది, సమస్త అభివృద్ధి గురించి మేమెంతో సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
శ్రీమతి వీణ మాధురి గారు కంటెస్టెడ్ కార్పొరేటర్ ఖైరతాబాద్ మాట్లాడుతూ ఈ సంస్థ నిర్వాహకులు శ్రీమతి చింతపల్లి శోభా రెడ్డి, నేను 30 సంవత్సరాల క్రితమే ఆర్ట్స్ విద్యలో తర్ఫీద్ పొందిన వాళ్లే మేనని నేషనల్ ఇంటర్నేషనల్ పోటీలలో కూడా పాల్గొనే ప్రయత్నించామని గత స్మృతిని నెమరు వేసుకుంటూ ముఖ్యంగా ఆడపిల్లలకు యోగ మరియు మార్షల్ ఆర్ట్స్ నేర్పడం అనేది గర్వించదగిన విషయమేమీ పేర్కొన్నారు.
సభకు ప్రముఖ కవి విశ్రాంత పోలీస్ అధికారి శ్రీ.పెద్దూరి వెంకట దాసు, మరియు ప్రముఖ సంఘ సేవకులు ఐటీ ప్రొఫెషనల్ అయినా శ్యామ్ ప్రసాద్ గార్ల వ్యాఖ్యానాలతో సబికులను ఆనందోత్సవాలలో ముంచెత్తారు.
శ్రీ. సి సందీప్ యాదవ్ గారు, శ్రీ గూడూరి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ సమస్త అభివృద్ధికి మా సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటావని ఇలాంటి కార్యక్రమాలకు రాయల్ గార్డెన్ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుందని ఆయన హామీ ఇచ్చారు. ఇందులో ముఖ్యంగా మహిళా ట్రైనర్ అయిన సహస్ర, బేబీ తరుణీ రెడ్డి చేసిన విన్యాసంలు ఆహుతులను విశేషంగా ఆకర్షించినవి.
ట్రేన్నర్స్ Miss.సహస్ర, మిస్టర్.M.Ravi,M.సుధాకర్, కల్పనా సింగ్, కోటేశ్వరరావు, పూజ నృత్లీకర్, మిస్టర్ అరుణ్, మిస్టర్ సంతోష్ యాదవ్. మరియు మిగతా ప్రోగ్రామ్ కొచ్చిన పేరెంట్స్ మరియు అభిమానులు.