డ్రంక్ అండ్ డ్రైవ్ లో 14 మందికి జరిమానా

డ్రంక్ అండ్ డ్రైవ్ లో
14 మందికి జరిమానా

వీణవంక, ఏప్రిల్ 30 (విశ్వం న్యూస్) : వీణవంక మండలంలో మద్యం తాగి వాహనాలు నడిపిన 14 మంది వ్యక్తులకు కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించిన తర్వాత గౌరవ హుజురాబాద్ మెజిస్ట్రేట్ ముందు హాజరు పరచగా 14,000/- జరిమానా విధించడం జరిగిందని ఎస్సై కే.శేఖర్ రెడ్డి తెలిపారు.

మైనర్ పిల్లలు వాహనాలు నడుపుతూ పట్టుబడిన లేదా ప్రమాదాలకు గురైన తల్లిదండ్రులపై చర్యలు తీసుకుంటామని. మద్యం త్రాగి వాహనాలు నడపడం వల్ల చాలామంది ప్రమాదాలకు గురై చనిపోవడం జరుగుతుందని, మరికొంతమంది తీవ్రమైన గాయాలకు గురి కావడం ప్రాణాలకు కూడా హాని కలిగించడం జరుగుతుందని రోడ్డు ప్రమాదాల నియంత్రణ కోసమే డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుందని. కావున వాహనదారులు త్రాగి వాహనాలు నడపవద్దని, వాహనానికి సంబంధించిన అన్ని ధ్రువపత్రాలు కలిగి ఉండి పోలీసులకు సహకరించాలని. మద్యం తాగి వాహనాలు నడిపినట్లయితే చట్టప్రకారం చర్యలు తీసుకోవడమే గాక, లైసెన్స్ రద్దు కోసం ప్రతిపాదనలు పంపడం జరుగుతుంది, జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉందని ఎస్సై కే శేఖర్ రెడ్డి హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *