జెఈఈ (మెయిన్స్):2023 ఫలితాలలో
ట్రినిటి విద్యార్థుల అద్భుత ప్రతిభ

కరీంనగర్ బ్యూరో, ఏప్రిల్ 29 ( విశ్వం న్యూస్ ) : ఈ రోజు ప్రకటించిన జెఈఈ (మెయిన్స్) ఫలితాలలో ట్రినిటి విద్యార్థులు అత్యధిక పర్సెంటైల్తో జాతీయ స్థాయిలో అద్భుత ర్యాంకులు సాధించారు. జె ఈ ఈ (మెయిన్స్) ఫలితాలలో అన్ని క్యాటగిరీలలో విద్యార్థులు జాతీయ స్థాయిలో సాధించిన ర్యాంకులు ఎ. శ్రావణ్ 617, బి.భానుప్రకాష్ 676, ఎన్. సుహాస్ రెడ్డి 1225, ఎ.అనిల్ 1524, పి.అభినయ 1686, ఎం.రాజారెడ్డి 1837 ర్యాంకును సాధించారు. కాగా ర్యాంకులు సాధించిన విద్యార్థులు స్కూల్ లెవల్ పౌండేషన్తో పాటు, ఇంటర్ లో ఐ ఐ టి కోచింగ్ వలన జె ఈ ఈ మెయిన్స్ లో 71% సాధించి జె ఈ ఈ అడ్వాన్స్ కు 231 మంది విద్యార్థులు అర్హత సాధించారని ట్రినిటీ కళాశాల చైర్మన్ దాసరి ప్రశాంత్ రెడ్డి తెలిపారు.
అనుభవజ్ఞులైన అధ్యాపకుల పర్యవేక్షణలో, ఉత్తమ విద్యా విధానంతో మా విధ్యార్ధులు ఉన్నత ర్యాంకులు సాధించడం సాధ్యమైందని ప్రశాంత్ రెడ్డి తెలియజేశారు. ఉన్నత ర్యాంకులు సాధించిన విద్యార్థులను చైర్మన్ వివిధ ట్రినిటీ కళాశాలల ప్రిన్సిపాల్స్ సత్కరించారు. ఈ సందర్భంగా తేది 30.04.2023 రోజున ఉదయం 10 గం॥ నుండి 11.30 గం॥ ల వరకు మా కళాశాలలో పదవ తరగతి పూర్తిచేసిన విద్యార్థులకు స్కాలర్షిప్ టెస్ట్ నిర్వహిస్తున్నామని, ఈ టెస్ట్ లో మంచి మార్కులు (ర్యాంకు సాధించిన విద్యార్థులకు (ఇంటర్ తో పాటు ఐ ఐ టి – జె ఈ ఈ/ నీట్) అడ్మిషన్ టెస్ట్ లో వారు చూపిన ప్రతిభ ఆధారంగా పూర్తిగా ఫీజు మాఫీ చేయడంగాని, ఫీజులో రాయితీ ఇవ్వడంగాని జరుగుతుందని తెలియజేశారు. మ్యాథ్స్ 40, ఫిజిక్స్ 15, కెమిస్ట్రీ 15, బయోలాజికల్ సైన్స్ 10లో ప్రశ్నలు ఉంటాయని, మొత్తం 80 ప్రశ్నలకు, 90 నిమిషాల సమయం ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ పరీక్షలో పదవ తరగతి సిలబస్ తో మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయని తెలిపారు. ఈ అవకాశాన్ని పదవ తరగతి పూర్తి చేసిన విద్యార్థులు వినియోగించుకోవాలని తెలియజేశారు.
జె ఈ ఈ (అడ్వాన్స్)కు అర్హత సాధించిన కళాశాల ఇతర కళాశాలల విద్యార్థిని విద్యార్థులకు అందరికి ఉచితంగా నెల రోజులు కోచింగ్ ట్రినిటీ ప్రైమ్ క్యాంపస్ లో అనుభవజ్ఞులైన అధ్యాపక బృందంచే ఇప్పించడం జరుగుతుందని చైర్మన్ ప్రశాంత్ రెడ్డి తెలియజేసారు.