ఘనంగా 77వ స్వాతంత్య్ర
దినోత్సవ వేడుకలు

- ఇండియన్ ప్రజా కాంగ్రెస్ తెలంగాణ స్టేట్ ఆఫీస్ నందు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన డాక్టర్.గూడూరి చెన్నారెడ్డి
హైదరాబాద్, ఆగస్టు 15 (విశ్వం న్యూస్) : ఇండియన్ ప్రజా కాంగ్రెస్ తెలంగాణ స్టేట్ ఆఫీస్ నందు త్రివర్ణ పతాకాన్ని డాక్టర్.గూడూరి చెన్నారెడ్డి, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ వికలాంగురాలైన ఉదయలక్ష్మి సంయుక్తంగా ఆవిష్కరించారు. తర్వాత డాక్టర్.గూడూరి చెన్నారెడ్డి మాట్లాడుతూ… భారతదేశం ఆగస్టు 15, 2023న తన 77వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటోంది. దాదాపు రెండు శతాబ్దాల బ్రిటిష్ వలస పాలన తర్వాత 1947లో ఇదే రోజున భారతదేశం స్వతంత్ర దేశంగా అవతరించింది. ఈరోజు ప్రపంచంలోనే తిరుగులేని ఒక శక్తిగా నిలిచింది. స్వాతంత్య్ర దినోత్సవం భారతీయులందరూ గర్వపడాల్సిన సందర్భం, ఈ జాతీయ పండుగను ప్రతీ భారతీయ పౌరుడు సంతోషంగా, సగర్వంగా జరుపుకోవాలి. మనం స్వేచ్ఛగా జీవించటానికి తమ ప్రాణాలను త్యాగం చేసిన స్వాతంత్య్ర సమరయోధులందరినీ, వారు చూపిన దేశభక్తిని స్మరించుకోవాలి. భారత పౌరులందరికీ, సమస్త ప్రజానీకానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు.

స్వతంత్ర సంగ్రామంలో జీవితాలను పణంగా పెట్టిన త్యాగధనులకు నివాళులర్పించారు. ఆజాదీ కా అమృత మహోత్సవ్-అమృత కాలంలో తొలి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజలందరితో కలిసి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. పిల్లలకు మిఠాయిలు పంచి, పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఏమై కోరుకునే ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నారో.. ఆ కలలో కలలుగానే నిలిచిపోయావని, సబండవర్ణాలు సర్వం త్యాగం చేసి ధన, ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన అన్ని వర్గాలకు నిరాశమే మిగిలింది. విద్యార్థులకేకాక కార్మిక వర్గాలు జీతాలను సైతం లెక్కచేయక పోరాడినందుకు వారి హక్కుల సాధనకు ఏకైక మార్గమైన సంయుక్తంగా పోరాటం చేయడం, హక్కులు సాధించుకోవడం, ప్రశ్నించే గొంతులపై రజాకారుల మాదిరిగా విరుసుకుపడి వారి గొంతులను నొక్కుతున్నారు.
రచయితలకు రాయడానికి చేతులు రాకుండా చేశారు. కళాకారులకు కాళ్లకు గజ్జ కట్టి వాస్తవాలను ప్రజలకు చెప్పుదామంటే కట్టిన కాళ్లకు హుక్కు సంఖ్యలను వేయించారు. రైతులు పండిన పంటకు గిట్టుబాటు ధర లేక అల్లాడిపోతున్నారు. లక్షల కోట్ల రూపాయలు ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద పెట్టినప్పటికీని రైతుల ఆత్మ హత్యలు ఆగడం లేదు. తాను ఏది తెలిస్తే అదే ఏ పథకం ప్రవేశపెడితే ఓట్లు వస్తాయి సీట్లు దక్కుతాయని ఆలోచన తప్ప మరొకటి లేదు. ప్రతిదీ ఉచితల పేరుతో ఆత్మగౌరవాన్ని చంపేస్తున్నది ప్రభుత్వం.
ఏ ప్రభుత్వమైనా ప్రజల డిమాండ్ మేరకే పని చేయాల్సి ఉంటుంది కానీ తెలంగాణ ప్రభుత్వం చేసినవన్నీ కూడా ప్రజల డిమాండ్ లేనివే. రాష్ట్రం మిగులు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రాన్ని లక్ష కోట్లకు పైన అప్పులు దిగిపోయింది. తద్వారా ఏమైనా సంక్షేమ పథకాలు చేపట్టారు అంటే అవి ఏమీ లేవు తాత్కాలిక తైలాలు తప్ప.
టోటల్గా తెలంగాణ రాష్ట్రంలో బిక్కుబిక్కుమంటూ భయాందోళనలో మధ్య జీవనము గడుపుతున్నారు అనడంలో సందేహం లేదు. కనుక రాబోవు కాలంలో ఇండియన్ ప్రజా కాంగ్రెస్ ప్రజాభిప్రాయానికి అనుగుణంగా నడుచుకొని ప్రజల శ్రేయస్సు కోరి ప్రజల మధ్యనే ఉంటూ ప్రజల కష్టసుఖాలు తెలుసుకుంటూ, ప్రజలు ఆత్మ గౌరవంగా బతికే ప్రయత్నం చేస్తామని అడుక్కుతినే పద్ధతికి స్వస్తి పలుకుతామని ప్రజల సేవ చేయాలనుకుంటున్న ప్రజా కాంగ్రెస్ ను మీరందరూ దీవించాలని కోరుకుంటూ ముగించారు.
ఈ కార్యక్రమములో జి మహేందర్ రెడ్డి తెలంగాణ స్టేట్ యూత్ ప్రెసిడెంట్, బి.కే.డా. గూడూరి విజయలక్ష్మి, తెలంగాణ స్టేట్ కోశాధికారి, డా. కే. హెచ్. ఎస్ .శర్మ జాతీయ జనరల్ సెక్రెటరీ, చింతపల్లి శోభా రెడ్డి ఉమెన్స్ వెల్ఫేర్ చైర్మన్, పెద్దూరు వెంకట దాస్, వి రాధాకృష్ణ, సుబ్బారావు, కేబీ శ్రీధర్ జాతీయ అధ్యక్షుడు, ఉదయలక్ష్మి జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షురాలు, సూర్య ప్రకాష్, జాతీయ మీడియా అడ్వైజరు అంజనీ దేవి, మహిళా విభాగం జాతీయ కార్యదర్శి గంగిరెడ్డి, అల్లాజి యాదవ్, సేవాదళ్ విభాగం జాతీయ కార్యదర్శులు, లీగల్ విభాగం జాతీయ కార్యదర్శులు, అడ్వకేట్ లక్ష్మీ, కె. బి రామ్మూర్తి, మహిళా విభాగం నాయకురాలు మానస, ఉదయ భాస్కర్, సహస్ర, రమా దేవి, శ్రేష్ట, జయశ్రీ గాయత్రి, వాణి, లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.