స్కీమ్ వర్కర్లకు కనిస వేతనం 26000 ఇవ్వాలి

స్కీమ్ వర్కర్లకు కనిస వేతనం 26000 ఇవ్వాలి

ములుగు, జనవరి 4, (విశ్వం న్యూస్): స్కీమ్ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని జనవరి 6న జరుగు కార్యక్రమం సమాచారం నిమిత్తం డిఎంహెచ్ఓ అళ్లెం అప్పయ్య కు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈనెల 6 నుండి దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను నిర్వహించినట్లు ఆశ వర్కర్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడు గుండెబోయిన రవి గౌడ్ అన్నారు. అదేవిధంగా మండల తాహసిల్దార్ కార్యాలయాల ముందు నిరసన కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు . ఈ సందర్భంగా రవి గౌడ్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆశాలకు ఫిక్స్డ్ వేతనం చేయకుండా శ్రమ దోపిడికి గురి చేస్తున్నారని అన్నారు. తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనీస వేతనం అమలు చేయాలని ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని నగదు రైహిత వైద్య సేవలు అందించాలని రెండో విడత కంటి వెలుగు ప్రోగ్రాం కు అదనంగా టి ఏ డి ఎల్ ఇవ్వాలని.. ఆరు నెలల పెండింగ్ పిఆర్సి తక్షణమే విడుదల చేయాలని 16 నెలల కోవిడ్ ఇన్సెంటివ్ ఇవ్వాలని ఏఎన్ఎం పోస్టుల్లొ ఆశా లకు మొదటి ప్రిఆర్టీ ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈనెల 6 న దేశ వ్యాప్తంగా జరుగు నిరసన కార్యక్రమాలను ఎమ్మార్వోలకు వినతిపత్రం ఇచ్చే కార్యక్రమాలను అన్ని మండలాల్లో జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆశాయూనియన్ జిల్లా అధ్యక్షురాలు రత్నం నీలాదేవి. శిరీష.కనక లక్ష్మి. యశోద. రమాదేవి.తదితరులు పాల్గొన్నారు.

డిఎం అండ్ హెచ్ వో కు వినతిపత్రం ఇస్తున్న ఆశ వర్కర్స్ యూనియన్ నాయకుడు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *