10వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ప్రారంభించిన బొమ్మక్ బాలయ్య
10వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్
ప్రారంభించిన బొమ్మక్ బాలయ్య

- మాజీ జెడ్పిటిసి, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి..
- కార్పొరేటర్ బొమ్మక్ సుగుణ బాలయ్య ఇతర కార్పొరేటర్లు హాజరు

బోడుప్పల్, మే 3 (విశ్వం న్యూస్) : బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 10వ డివిజన్ కార్పొరేటర్ బొమ్మక్ సుగుణ బాలయ్య ల ఆధ్వర్యంలో 10వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని హైట్రిక్ వార్డు సభ్యులు బొమ్మక్ బాలయ్య చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ జెడ్పిటిసి సభ్యులు, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మంద సంజీవరెడ్డి, స్థానిక కార్పొరేటర్ బొమ్మక్ సుగుణ బాలయ్యలు హాజరై జెండా ఆవిష్కరణ చేశారు.

ఈ సందర్భంగా కార్పొరేటర్ బొమ్మకు సుగుణ బాలయ్యలు మాట్లాడుతూ బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అభివృద్ధిలో 10వ డివిజన్ ముందుకు సాగుతుందని, దానికి కారణం ఈ ఏరియాలో మూడుసార్లు పనిచేసిన మాజీ హైట్రిక్ వార్డు సభ్యులు బొమ్మక్ బాలయ్య సీనియార్టీ పనితనమే 10వ డివిజన్ అభివృద్ధిలో దూసుకుపోతుందని కొనియాడారు. ఇంకా చాలా అభివృద్ధి చేయాల్సి ఉందని రాబోయే కాలంలో అభివృద్ధి చేసి బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ లోనే నెంబర్వన్ అనిపించుకుంటామని హామీ ఇచ్చారు.

ఈమేరకు మంద సంజీవరెడ్డి మాట్లాడుతూ బోడుప్పల్ కార్పొరేషన్ లోనే 10వ డివిజన్ అభివృద్ధిలో దూసుకుపోతుందని, దానికి సహకరించిన కమిషనర్ అధికారులు మేయర్ సామల బుచ్చి రెడ్డి, మంత్రి మల్లారెడ్డి, ఐటి శాఖ మంత్రి కేటీఆర్ తదితరుల ప్రోత్సాహం ప్రోద్బలమే కారణమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఇతర కార్పొరేటర్లు మహేశ్వరి కృపాసాగర్, శ్రీ విద్యా చక్రపాణి, సుమన్ నాయక్, రసాల వెంకటేశ్ యాదవ్, మాజీ ఉపసర్పంచ్ కొత్త రవి గౌడ్, కోఆప్షన్ సభ్యులు, బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మీసాల కృష్ణ, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు జక్క రాములు, క్షత్రజ్ఞ, పదవ డివిజన్ అధ్యక్షులు శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి మల్లేష్ వెంకటేష్ డివిజన్ నాయకులు కార్యకర్తలు నేతలు యువత మహిళలు తదితరులు హాజరయ్యారు.
