కమణీయం శ్రీ వెంకటేశ్వర స్వామి జాతర మహోత్సవం
కమణీయం శ్రీ వెంకటేశ్వర
స్వామి జాతర మహోత్సవం

- స్వామి వారిని దర్శించుకున్న మానకొండూర్ శాసనసభ్యులు డా.రసమయి
కరీంనగర్ బ్యూరో, మే 7 (విశ్వం న్యూస్) : మానకొండూర్ మండలం శ్రీనివాస్ నగర్ గుట్ట వద్ద ఆదివారం రోజు శ్రీ వెంకటేశ్వర స్వామి జాతర కమణీయంగా సాగింది. ఈ జాతరకు రాష్ట్ర సాంస్కృతిక సారథి ఛైర్మెన్, మానకొండూర్ శాసనసభ్యులు డా.రసమయి బాలకిషన్, బీ.ఆర్.ఎస్.పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు, సుడా ఛైర్మెన్ జీవి. రామకృష్ణా రావు లు హాజరై స్వామి వారిని దర్శించుకున్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక మండల బీ ఆర్ ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
