గాయత్రినగర్ లో సుద్ద కుంట నాలా బ్రిడ్జిపై సర్వసభ్య సమావేశం

గాయత్రినగర్ లో సుద్ద కుంట
నాలా బ్రిడ్జిపై సర్వసభ్య సమావేశం

కార్పొరేటర్ కాటపల్లి లతా రామచంద్ర రెడ్డి,
సత్యం రెడ్డి,పిసి రెడ్డిలు హాజరు

బోడుప్పల్, మే 8 (విశ్వం న్యూస్) : బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 7,8,9 డివిజన్లకు సంబంధించి సుద్దకుంట చెరువు,నాలా బ్రిడ్జి 32 ఫీట్ల నుంచి 16 ఫీట్లకు కుదించి చేస్తున్నటువంటి బ్రిడ్జి పనిలో భాగంగా ఏడవ డివిజన్ కు సంబంధించి గాయత్రి నగర్ ఫేస్ 1,2, ఆంజనేయ నగర్ తదితర కాలనీవాసులు ఆధ్వర్యంలో సర్వేసభ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమం గాయత్రి నగర్ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి స్థానిక కార్పొరేటర్ కాటేపల్లి లతా రామచంద్ర జి రెడ్డిలు హాజరయ్యారు.ఈ మేరకు కార్పొరేటర్ లతా రామచంద్రారెడ్డిలు మాట్లాడుతూ సుద్ధకుంట నాలా బ్రిడ్జిని సంబంధించి అతి త్వరలోనే మున్సిపల్ కమిషనర్ అధికారులను పిలిపించి తగ్గించిన బ్రిడ్జి నాలా తదితర అంశాల మీద చర్చించడం జరుగుతుంద,ని అతి త్వరలోనే ఈ సుద్ధకుంట బ్రిడ్జికి సంబంధించి అంశంపై ఒక పులిస్టాప్ ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పిసి రెడ్డి, డివిజన్ అధ్యక్షులు సత్యం రెడ్డి 3 కాలనీల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గాయత్రి నగర్ కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి, ఉపాధ్యక్షురాలు అనూష బేగం,కాలనీవాసులు ప్రభావతి, పూస యాదగిరి, సుధాకర్, యాదగిరి, స్వామి, కుమార్ గౌడ్, సంతోష్, మహిళలు తదితరులు హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *