ఎంఐఎం పార్టీని ముస్లిం ప్రజలు నమ్మే పరిస్థితి లేదు
ఎంఐఎం పార్టీని ముస్లిం
ప్రజలు నమ్మే పరిస్థితి లేదు

హుజురాబాద్, మే 19 (విశ్వం న్యూస్) : తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ ప్రాంతానికి పరిమితమైన ఎంఐఎం పార్టీని తెలంగాణ ముస్లిం మైనార్టీ వర్గాలు నమ్మే పరిస్థితి లేదని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎండి సాహెబ్ హుస్సేన్, ఎండి అప్సర్ లు అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ముస్లిం మైనార్టీలను రెచ్చగొట్టి తమ పబ్బం గడుపుకోవడానికి హైదరాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి ఎంఐఎం పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉంది అనుకోవడం వారి అవివేకం, జాతీయ పార్టీ అయినా కాంగ్రెస్ ఓట్లను టిఆర్ఎస్ కు పడకుండా కాంగ్రెస్ ఓటు బ్యాంకును చీల్చడానికి పుట్టిన పార్టీ ఎంఐఎం పార్టీ ముస్లిం మైనార్టీల పట్ల నిజంగా చిత్తశుద్ధి ఉంటే టిఆర్ఎస్ ప్రభుత్వం మైనార్టీలకు చేస్తున్న మోసం అక్బరుద్దీన్ గారికి కనిపించడం లేదా అసెంబ్లీలో ఏ ఒక్క పేద ముస్లిం మైనార్టీ కి ప్రభుత్వ సబ్సిడీ లోన్లు కానీ రెండు పడకల ఇండ్లు కానీ రాలేదని వాటిని రాష్ట్ర ప్రభుత్వ మెడలు వంచి పేద ముస్లిం మైనార్టీలకు ఇప్పించడంలో ఎంఐఎం పార్టీ ముందుండాలని వారన్నారు.
అంతేకానీ కాంగ్రెస్ ఓటు బ్యాంకును చీల్చకుండా తమకు పట్టున్నచోటనే పోటీ చేయాలి రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ముస్లిం ఓట్ల శాతాన్ని ఎంచుకొని కాంగ్రెస్కు నష్టపరిచే విధంగా వివరించవద్దని వారన్నారు. ఈ కార్యక్రమంలో ఆడెపు ఐలయ్య, ఎండి ఇర్ఫాన్, ఎండి చాంద్ పాషా, ఎండి రజాక్ తదితరులు పాల్గొన్నారు.
