స్వచ్ఛ సర్వేక్షన్ లో పాల్గొన్న
కార్పొరేటర్ తలారి చంద్రశేఖర్

బండ్లగూడ జాగీర్, మే 23 (విశ్వం న్యూస్) : బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఒకటో వార్డు పరిధి జే ఎన్ ఎన్ యు ఆర్ ఎం వీకర్ సెక్షన్ కాలనీలో స్వచ్ఛ సర్వేక్షన్ ఏర్పాటు చేశారు. కార్పొరేటర్ తలారి చంద్రశేఖర్ ఆదేశాల మేరకు కాలనీలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పడం జరిగింది పరిసరాలు మరుగుదొడ్లు శుభ్రంగా లేనిచో వివిధ రకాల వ్యాధులు వస్తాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బండ్లగూడ జాగిర్ మేనేజర్ నరేష్, వార్డు జవాన్ రామాంజనేయులు, నరేష్, యాదగిరి, సుభాష్, రాము మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
