పీర్జాదిగూడ 18వ డివిజన్ లో 100% పూర్తయిన సిసి రోడ్లు

పీర్జాదిగూడ 18వ డివిజన్ లో
100% పూర్తయిన సిసి రోడ్లు

పీర్జాదిగూడ, మే 28 (విశ్వం న్యూస్) : పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 18వ డివిజన్ పార్వతి నగర్ లో కొన్ని ఏండ్లుగా పెండింగ్ లో ఉన్న మట్టి రోడ్డు స్థానిక కార్పొరేటర్ కుర్ర శాలినిశ్రీకాంత్ గౌడ్ ల ప్రత్యేక చొరవతో ఆదివారం సిసి రోడ్డు వేయడం జరిగింది.

అదేవిధంగా ఇప్పటివరకు 18వ డివిజన్ పరిధిలోని అన్ని కాలనీలలో 100కు 100% రోడ్లను పూర్తి చేయడం జరిగిందని స్థానిక కార్పొరేటర్ కుర్ర శాలిని శ్రీకాంత్ గౌడ్ లు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా 18వ డివిజన్ లోని ప్రజలు కార్పొరేటర్ ముందు చూపు, పనిపట్ల హర్ష వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *