జాతీయస్థాయిలో రాణించడం అభినందనీయం: డాక్టర్ పి.సాంబశివరావు

కాజీపేట:జాతీయస్థాయిలో
రాణించడం అభినందనీయం:
డాక్టర్ పి.సాంబశివరావు

కాజీపేట జంక్షన్ లో క్రీడాకారులకు ఘన స్వాగతం
కాజీపేట, జూన్ 9 (విశ్వం న్యూస్) : ఓరుగల్లు సాఫ్ట్ బాల్ క్రీడాకారులు జాతీయస్థాయిలో రాణించడం అభినందనీయమని తెలంగాణ రాష్ట్ర సాఫ్ట్ బాల్ ఆసోసియేషన్ చైర్మన్ డాక్టర్ పి. సాంబశివరావు కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపూర్ లో ఈనెల 6, 7, 8వ తేదీల్లో జరిగిన జాతీయస్థాయి సాఫ్ట్ బాల్ క్రీడా పోటీల్లో పాల్గొని పలు పతకాలను సాధించిన అనంతరం రైలులో శుక్రవారం కాజీపేట జంక్షన్ కు చేరుకున్న క్రీడాకారులకు ఆయన ఆధ్వర్యంలో పూలమాలలతో ఘన స్వాగతం లభించింది. మిఠాయిలను పంపిణీ చేసి కోచ్ వినయ్ ను, జాతీయ స్థాయి క్రీడాకారులు తాబేటి శ్రీకరన్, అఖిల్, విష్, విరి, విలున్నవ్ లను అభినందించిన అనంతరం ఆయన మాట్లాడారు.

అండర్ 11 ఏళ్ల విభాగంలో బాలుర జట్టు 2వ స్థానం, 13 ఏళ్ళ బాలుర,బాలికల విభాగంలో 3వ స్థానం సాధించినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సాఫ్ట్ బాల్ క్రీడాభివృద్దికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి తాబేటి రాజేందర్, జిల్లా ఉపాధ్యక్షులు పెరుమాండ్ల సాంబమూర్తి, కోచ్ తాబేటి నాగరాజు, ఫిజికల్ డైరెక్టర్ శ్రీధర్, పలువురు క్రీడాకారులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *