మున్నూరు కాపు జర్నలిస్టుల క్యాలెండర్ ఆవిష్కరించిన: మంత్రి గంగుల

తిమ్మాపూర్, జనవరి 22 (విశ్వం న్యూస్) : విలువలతో కూడిన జర్నలిజం అసలైన జర్నలిజం అని, మున్నూరు కాపు జర్నలిస్టుల క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖమంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఆదివారం కరీంనగర్ లోని మంత్రి గంగుల కమలాకర్ నివాసంలో తెలంగాణ మున్నూరు కాపు జర్నలిస్టు ఫోరం నూతన క్యాలెండర్-2023 ను మంత్రి గంగుల కమలాకర్ సంఘ పాలకవర్గ సభ్యు లతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ… క్షణ క్షణం సమాజ సేవలో ముందుండే జర్నలిస్టుల సేవలు మరువలేనివి అని, సమాజంలో ప్రజల సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి, సమస్యల పరిష్కారం దిశగా ముందుండే వ్యక్తులు జర్నలిస్టులన్నారు. తెలంగాణ ప్రభుత్వం జర్నలిస్టులకు అండగా ఉంటుందన్నారు. అనంతరం తెలంగాణ మున్నూరు కాపు జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు కొత్త లక్ష్మణ్ పటేల్ మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రంలో 5వేల కు పైగా మున్నూరు కాపు జర్నలిస్టులు వివిధ ప్రింట్, అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్నారని తెలిపారు. జర్నలిస్టులకు అండగా తెలంగాణ ము న్నూరు కాపు జర్నలిస్ట్ ఫోరం ఉంటుందని తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ ను తెలంగాణ మున్నూరు కాపు జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మున్నూరు కాపు జర్నలిస్టు ఫోరం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వేల్పుల శ్రీనివాస్ పటేల్, సూదుల వెంకటరమణ పటేల్, గౌరవ సలహాదారులు బోనాల మల్లికార్జున్ పటేల్, ఉపాధ్యక్షులు దూలూరి జగన్ మోహన్ పటేల్, బండి రఘు పటేల్, వర్కింగ్ ప్రెసిడెంట్ తోట శ్రీకాంత్ పటేల్, కార్యదర్శులు కామి నేని మధుసూదన్ పటేల్, కోశాధికారి తోట రమణ పటేల్, ఆర్గనైజింగ్ సెక్రటరీ బోనాల వెంకటేష్ పటేల్, చల్ల కృష్ణ పటేల్, అట్టెపెల్లి శ్రీనివాస్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.