అట్టహాసంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రమాణస్వీకారం

  • మంత్రిగా ప్రమాణం చేసి అన్నయ్య కాళ్లు మొక్కిన పవన్ కళ్యాణ్
  • మెగా బ్రదర్స్‌తో కలిసి అభివాదం చేసిన ప్రధాని మోదీ

హైదరాబాద్, జూన్ 12 (విశ్వం న్యూస్) : టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నాలుగోసారి ప్రమాణస్వీకారం చేశారు. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తదితరుల సమక్షంలో చంద్రబాబు సీఎంగా ప్రమాణం చేశారు.

చంద్రబాబు తర్వాత జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణం చేశారు. అనంతరం ప్రధాని మోదీ, చంద్రబాబుల దగ్గరకు వెళ్లి ఆశీస్సులు పొందిన ఆయన.. వేదికపై ఉన్న తన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి కాళ్లు మొక్కి ఆశీర్వాదం పొందారు. పవన్ ప్రమాణం చేస్తుండగా.. ఆయన సతీమణి అన్నా లెజినోవా సంతోషంగా ఫోన్లో వీడియో తీస్తూ కనిపించారు.

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన చంద్రబాబు గురువారం సాయంత్రం (రేపు) 4.41 గంటలకు బాధ్యతలు స్వీకరించనున్నారు. సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో అధికారులు ఈమేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మెగా డీఎస్సీపై తొలి సంతకం, ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టం రద్దుపై రెండో సంతకం, పింఛను రూ.4వేలకు పెంచుతూ మూడో సంతకం చేయనున్నారు. దీనికి సంబంధించిన దస్త్రాలను అధికారులు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది…

ఆంధ్రప్రదేశ్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసింది వీరే..

  1. పవన్‌ కల్యాణ్‌ (జనసేన)
  2. నారా లోకేశ్‌ (తెదేపా)
  3. అచ్చెన్నాయుడు (తెదేపా)
  4. కొల్లు రవీంద్ర (తెదేపా)
  5. నాదెండ్ల మనోహర్‌ (జనసేన)
  6. పి. నారాయణ (తెదేపా)
  7. వంగలపూడి అనిత (తెదేపా)
  8. సత్యకుమార్‌ యాదవ్‌ (భాజపా)
  9. నిమ్మల రామానాయుడు (తెదేపా)
  10. ఎన్‌.ఎమ్‌.డి ఫరూక్‌ (తెదేపా)
  11. ఆనం రామనారాయణరెడ్డి (తెదేపా)
  12. పయ్యావుల కేశవ్‌ (తెదేపా)
  13. అనగాని సత్యప్రసాద్‌ (తెదేపా)
  14. కొలుసు పార్థసారథి (తెదేపా)
  15. డోలా బాలవీరాంజనేయస్వామి (తెదేపా)
  16. గొట్టిపాటి రవి (తెదేపా)
  17. కందుల దుర్గేశ్‌ (జనసేన)
  18. గుమ్మిడి సంధ్యారాణి (తెదేపా)
  19. బీసీ జనార్దన్‌రెడ్డి (తెదేపా)
  20. టీజీ భరత్‌ (తెదేపా)
  21. ఎస్‌.సవిత (తెదేపా)
  22. వాసంశెట్టి సుభాష్‌ (తెదేపా)
  23. కొండపల్లి శ్రీనివాస్‌ (తెదేపా)
  24. మందిపల్లి రామ్‌ప్రసాద్‌ రెడ్డి (తెదేపా)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *