రాష్ట్ర ఖజానాకు ఆదాయం పెంచేందుకు పన్నులు సకాలంలో చెల్లించాలి

రాష్ట్ర ఖజానాకు ఆదాయం పెంచేందుకు పన్నులు సకాలంలో చెల్లించాలి

హైదరాబాద్, మార్చి 11 (విశ్వం న్యూస్) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నింపేందుకు వాణిజ్య పన్నుల శాఖ అధికారులు, ఉద్యోగులు జీఎస్టీ బకాయిలను వెంటనే వసూలు చేయాలని తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ పిలుపునిచ్చారు. రాష్ట్ర అభివృద్ధి కొనసాగాలంటే ప్రతి వ్యాపార సంస్థ, కంపెనీ యజమాని ప్రభుత్వానికి చెల్లించవలసిన పన్నులను సకాలంలో చెల్లించాల్సిన బాధ్యత ఉందన్నారు.

తెలంగాణ ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలను అమలు చేయడానికి ఖజానాకు ఆదాయం అవసరమని, అందుకు వ్యాపారస్తులు మరియు పరిశ్రమల యజమానులు తమపై ఉన్న అన్ని రకాల పన్నులు, బకాయిలను చెల్లించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పన్నులు సకాలంలో చెల్లిస్తేనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దేశంలో ముందంజలో నిలుస్తుందని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2025–26 ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు చేరుకుంటున్నందున రాష్ట్రంలోని వ్యాపారస్తులు, కంపెనీ యజమానులు తమ GSTR-3B రిటర్నులను సకాలంలో ఫైల్ చేసి ప్రభుత్వానికి ఆదాయం అందేలా సహకరించాలని కోరారు. అలాగే DRC-07 కింద ఉన్న జీఎస్టీ బకాయిలను కూడా వెంటనే చెల్లించాలని సూచించారు. జీఎస్టీకి ముందు ఉన్న వాట్, సీఎస్టీ, ఎంట్రీ ట్యాక్స్ వంటి పాత పన్నుల బకాయిలను కూడా త్వరితగతిన చెల్లించాలని వ్యాపారస్తులకు విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా IGST బకాయిలను కూడా ఆలస్యం చేయకుండా చెల్లించాలని తెలిపారు.

మార్చి నెలలో బకాయి పన్నుల వసూళ్లపై వాణిజ్య పన్నుల శాఖ అధికారులు, ఉద్యోగులు ప్రత్యేక దృష్టి పెట్టి సైనికుల్లా పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. దేశంలో జీఎస్టీ బకాయిల వసూళ్లలో తెలంగాణ రాష్ట్రం ముందంజలో నిలవడానికి ప్రతి అధికారి, ఉద్యోగి కృషి చేయాలని మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *