జనగామ జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం (వీడియో)

జాతీయ రహదారిపై
ఘోర ప్రమాదం (వీడియో)

రఘునాథపల్లి, జూన్ 13, (విశ్వం న్యూస్) : జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం గోవర్ధనగిరి దర్గా సమీపంలో శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందగా, మరో నలుగురు గాయపడ్డారు.

పోలీసుల వివరాల ప్రకారం, హైదరాబాద్ నుంచి హన్మకొండ వైపు వెళ్తున్న టీజీ24బి9237 నంబర్ గల ఎర్టిగా కారులో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ప్రయాణిస్తున్నారు. తెల్లవారుజామున సుమారు 2:30 గంటల సమయంలో గోవర్ధనగిరి గ్రామం వద్ద కారు అదుపుతప్పి రోడ్డు పక్కనున్న కాలువలో పడిపోయి చెట్టును ఢీకొట్టింది. ప్రమాదం తీవ్రతకు కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది.

ఈ ప్రమాదంలో హన్మకొండ నయీంనగర్‌కు చెందిన ఎండి అసద్ (26), సాఫ్ట్‌వేర్ ఉద్యోగి, అఫ్సా హబీబ్ (27), బీడీఎస్ వైద్యురాలు అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన రహముద్దీన్ ఖాన్ (డ్రైవర్), షాహీన్ బేగం, ఇలేషా, రేష్మాలను జనగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *