
నర్సంపేట, జూలై 26 (విశ్వం న్యూస్) : నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ ఉద్యమకారుడు పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రాణాలను కాపాడేందుకు వైద్యురాలు డాక్టర్ మమత రెడ్డి చేసిన ప్రయత్నం అందరినీ కదిలించింది. ఉదయం 8 గంటల నుంచి ఆయనను కాపాడేందుకు ఆమె వైద్య బృందంతో కలిసి నిర్విరామంగా శ్రమించారు. పలుమార్లు సీపీఆర్ (కార్డియో పల్మనరీ రిససిటేషన్) నిర్వహించినప్పటికీ స్పందన రాకపోవడంతో వైద్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
అయితే పట్టువిడవకుండా చేసిన ప్రయత్నాలు చివరకు ఫలించాయి. 9వ సారి నిర్వహించిన సీపీఆర్‌కు స్పందించిన పెద్ది సుదర్శన్ రెడ్డి గుండె లయను తిరిగి అందుకుంది. దీంతో డాక్టర్ మమత రెడ్డి కొంత ఊరట చెందారు. ఈ ఘటనను ఆమె “నిజంగా మెడికల్ మిరాకిల్”గా అభివర్ణించారు.
పెద్ది ప్రాణాలను కాపాడేందుకు డాక్టర్ మమత చూపిన అంకితభావం, పట్టుదల అక్కడున్న వారిని భావోద్వేగానికి గురి చేసింది. ఆసుపత్రికి చేరుకున్న పలువురు రాజకీయ నాయకులు, అభిమానులు డాక్టర్ మమత రెడ్డిని అభినందిస్తూ “హ్యాట్సాఫ్ మమత” అంటూ ఆమె సేవలను కొనియాడారు. వైద్య వృత్తిపట్ల ఆమె చూపిన నిబద్ధత అందరికీ ఆదర్శంగా నిలిచిందని ప్రశంసించారు.
పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం నిలకడగా ఉంది..పల్స్ బిపి సరిగానే ఉంది..రోహిణి హాస్పిటల్ నుండి మెరుగైన చికిత్స కోసంహైదరాబాద్ కి తరలిస్తాము–డాక్టర్ మమతారెడ్డి
హనుమకొండ రోహిణి ఆసుపత్రికి చేరుకున్న కేటీఆర్, హరీష్ రావు..