పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య
పరిస్థితి నిలకడగా ఉంది

నర్సంపేట, జూలై 26 (విశ్వం న్యూస్): నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ ఉద్యమకారుడు పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని వరంగల్‌లోని రోహిణి ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. గుండెపోటుతో తీవ్ర అస్వస్థతకు గురైన ఆయనకు అత్యవసర వైద్య సేవలు అందించిన అనంతరం ఆరోగ్య పరిస్థితి మెరుగుపడినట్లు తెలిపారు.
ఆయన అస్వస్థతకు గురైన విషయం తెలిసిన వెంటనే బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు వరంగల్‌కు చేరుకుని వైద్యులను కలిసి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన పెద్ది సుదర్శన్ రెడ్డి త్వరగా పూర్తిస్థాయిలో కోలుకోవాలని పార్టీ శ్రేణులు, అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
పెద్ది సుదర్శన్ రెడ్డికి వైద్యుల బృందం నిరంతరం పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నట్లు ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండటంతో కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులు ఊపిరి పీల్చుకున్నారు.