video:ఆర్టీసీ బస్సు బీభత్సం
పెట్రోల్ బంక్‌లోకి దూసుకెళ్లిన బస్సు.. రెండు కార్లు, ఆటో ధ్వంసం

రంగారెడ్డి జిల్లా: బాటసింగారంలో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. అతి వేగంగా వెళ్తున్న బస్సు ఓ ఆటోను తప్పించబోయి అదుపుతప్పి నేరుగా పెట్రోల్ బంక్‌లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో రెండు కార్లు, ఆటో ధ్వంసమయ్యాయి. దిల్సుఖ్నగర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు చౌటుప్పల్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
బస్సు బంక్‌లోని డీజిల్ పంప్ వరకు దూసుకెళ్లడంతో పరికరాలు విరిగిపడ్డాయి. అయితే అదృష్టవశాత్తూ బంక్ సిబ్బంది, అక్కడున్న వారు ప్రాణాలతో బయటపడ్డారు. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.