విశ్వకర్మలు రాజకీయ శక్తిగా ఎదగాలి : సిరికొండ మధుసూదనాచారి

విశ్వకర్మలు రాజకీయ శక్తిగా ఎదగాలి : సిరికొండ మధుసూదనాచారి

విశ్వకర్మలు రాజకీయ శక్తిగా ఎదగాలి : సిరికొండ మధుసూదనాచారి

విశ్వం న్యూస్,హైదరాబాద్, 25 అక్టోబర్ 2026 : విశ్వకర్మలు రాజకీయంగా ఐక్యమై శక్తిగా ఎదిగితే అన్ని రాజకీయ పార్టీలు తమకు ప్రాధాన్యత ఇవ్వాల్సి వస్తుందని మాజీ శాసనసభాపతి, బీఆర్ఎస్ శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి అన్నారు. ఆదివారం హైదరాబాద్ ప్రెస్ క్లబ్‌లో విశ్వకర్మ కమ్యూనిటీ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన విశ్వకర్మ పొలిటికల్ సమ్మిట్ రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు.

రాజకీయ గుర్తింపు, రాజ్యాధికారంలో భాగస్వామ్యం లేకుండా ఏ కులమూ అభివృద్ధి చెందలేదని పేర్కొన్నారు. జనాభా పరంగా గణనీయమైన సంఖ్యలో ఉన్న విశ్వబ్రాహ్మణులకు తగిన రాజకీయ ప్రాతినిధ్యం దక్కడం లేదన్నారు. వచ్చే ఎన్నికల నాటికి కనీసం పది మంది విశ్వకర్మలు చట్టసభలకు ఎన్నిక కావాలని ఆకాంక్షించారు. వార్డు సభ్యుడి స్థాయి నుంచి ఎమ్మెల్యే వరకు అన్ని స్థాయిల్లో పోటీకి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

విశ్వకర్మ యువత, మహిళలను రాజకీయాల్లో పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని సమావేశంలో పలువురు నాయకులు అభిప్రాయపడ్డారు. గత ప్రభుత్వం ఇద్దరు విశ్వకర్మలకు శాసనమండలిలో అవకాశం కల్పించిందని, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తమకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. అన్ని రాజకీయ పార్టీలు విశ్వకర్మలకు సముచిత పదవులు, చట్టసభల్లో తగిన ప్రాతినిధ్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ సమావేశంలో జేఏసీ కన్వీనర్ దేవరకొండ కాళిదాస్, కో-కన్వీనర్ అడ్లూరి రవీంద్రాచారి, బీజేపీ సీనియర్ నాయకుడు తల్లోజు ఆచారి, కాంగ్రెస్ నాయకుడు తంగెళ్లపల్లి రవికుమార్, భువనగిరి మున్సిపల్ చైర్‌పర్సన్ వాణి, బీసీ జేఏసీ నేత కుందారం గణేశ్ చారి, సంఘం పెద్దలు లాల్ కోట వెంకట చారి, జేఏసీ నాయకులు బైరోజు శేఖర్ చారి, రాజమౌళి చారి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *