ఎర్రవెల్లిలో ఘనంగా కేసీఆర్ కుటుంబ దసరా వేడుకలు

ఎర్రవెల్లిలో ఘనంగా కేసీఆర్ కుటుంబ దసరా వేడుకలు

ఎర్రవెల్లి, అక్టోబర్ 20: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నివాసంలో మంగళవారం దసరా వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎర్రవెల్లిలోని ఆయన నివాసంలో వేద పండితుల సమక్షంలో సంప్రదాయబద్ధంగా వాహన పూజ, ఆయుధ పూజ నిర్వహించారు.
అనంతరం కేసీఆర్ శమీవృక్షానికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులతో కలిసి వేడుకల్లో పాల్గొన్న ఆయన అందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసి ఆశీర్వదించారు. వాహన పూజ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కల్వకుంట్ల హిమాన్షు రావు పాల్గొన్నారు.
ఈ వేడుకల్లో కేసీఆర్ సతీమణి శోభమ్మ, కుమారుడు కేటీఆర్, కోడలు శైలిమ, మనుమడు హిమాన్షు రావుతో పాటు మాజీ హోంమంత్రి మహమ్మద్ మహమూద్ అలీ, జహంగీర్, జుబేర్ తదితర పార్టీ నాయకులు పాల్గొన్నారు. అలాగే కేసీఆర్ పీఎస్ నాగేందర్ రెడ్డితో పాటు కార్యాలయ సిబ్బంది కూడా వేడుకల్లో పాల్గొన్నారు.