కరీంనగర్

హుజురాబాద్ క్లబ్‌ విజేతలకు ఘన సన్మానం

హుజురాబాద్: హుజురాబాద్ క్లబ్ ఎన్నికల్లో విజయం సాధించిన క్లబ్ కార్యదర్శి కట్కూరి మల్లారెడ్డి, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు కేసిరెడ్డి నర్సింహారెడ్డి, గడ్డం ధర్మారెడ్డిలకు బుధవారం ఘనంగా సన్మానం నిర్వహించారు.

తెలంగాణ కమర్షియల్, ట్యాక్సెస్ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మహ్మద్ ముజాహిద్ హుస్సేన్ స్థానిక హుజురాబాద్ క్లబ్‌లో ఈ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత 35 ఏళ్లుగా హుజురాబాద్‌లో పాత్రికేయ వృత్తిలో కొనసాగుతూ తమదైన గుర్తింపు పొందిన ముగ్గురు జర్నలిస్టులు క్లబ్ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించడం సంతోషకరమన్నారు.

క్లబ్ ఎన్నికల్లో హోరాహోరీగా సాగిన పోటీలో భారీ విజయం సాధించిన కార్యదర్శి, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులకు అభినందనలు తెలిపారు. వారి భవిష్యత్ బాధ్యతలు విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *