విజయరామారావు పార్థివ దేహానికి పుష్పాంజలి ఘటించిన సీఎం కేసీఆర్

విజయరామారావు పార్థివ దేహానికి పుష్పాంజలి ఘటించిన సీఎం కేసీఆర్

హైదరాబాద్, మార్చి 14 (విశ్వం న్యూస్) : మాజీ మంత్రి, దివంగత కె. విజయరామారావు నివాసానికి సీఎం కేసీఆర్ చేరుకుని, వారి పార్థివ దేహానికి పుష్పాంజలి ఘటించి, ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారి కుమారుడు, కూతురు, అల్లుడు, ఇతర కుటుంబ సభ్యులను సీఎం కేసీఆర్ పరామర్శించారు. ఇంటి పెద్ద ను కోల్పోయిన దుఃఖం లో వున్న వారిని ఓదార్చి ధైర్య వచనాలు తెలిపారు. అధికారికంగా జరుగుతున్న అంత్యక్రియలకు సంబంధించి జరగాల్సిన ఏర్పాట్ల గురించి సీఎం ఆరాతీసారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎమ్మెల్సీలు మధుసూధనా చారి, కడియం శ్రీహరి, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు శ్రవణ్ కుమార్ రెడ్డి, నారదాసు, డిజిపి అంజనీ కుమార్, కమిషనర్ సి.వి.ఆనంద్ తదితరులు నివాళులర్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *