వీణవంక మండలంలో జోరుగా సాగుతున్న అక్రమ ఇసుక రవాణా

వీణవంక మండలంలో జోరుగా సాగుతున్న అక్రమ ఇసుక రవాణా

  • కోడి కూతతో నిద్రలేవాల్సిన జనం ఇసుక ట్రాక్టర్ల మోతతో లేస్తున్నారు
  • వీణవంక మండలంలోని పట్టించుకోని రెవెన్యూ అధికారులు
  • ఎన్.ఎస్.యు.ఐ నాయకులు బొంగోని ప్రశాంత్ ఆవేదన
ఎన్.ఎస్.యు.ఐ నాయకులు బొంగోని ప్రశాంత్

వీణవంక, మార్చి 14 (విశ్వం న్యూస్) : వీణవంక మండలంలోని మానేరు పరివాహక ప్రాంతాలైన వీణవంక గ్రామాంలో అక్రమ ఇసుక రవాణా జోరుగా నడుస్తున్న మండల రెవెన్యూ అధికారులు మరియు స్థానిక ఎస్సై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. కోడి కూతతో నిద్రలేవాల్సిన జనం ఇసుక ట్రాక్టర్ల మోతతో నిద్రలేవల్సిన పరిస్థితి నెలకొంది. అదేవిధంగా అక్రమ ఇసుక రవాణా వల్ల పలుచోట్ల గతంలో ప్రమాదాలు జరిగాయి మరియు భవిష్యత్తులో జరిగే అవకాశం ఉంది. ఇప్పటికైనా స్థానిక రెవెన్యూ మరియు పోలీసు శాఖ స్పందించి తక్షణమే అక్రమ ఇసుక రవాణా చేస్తున్న వారి మీద చర్యలు తీసుకోవాలని ఎన్.ఎస్.యు.ఐ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ చర్యలు తీసుకోకపోతే ఎన్.ఎస్.యు.ఐ పక్షాన ధర్నా కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించడం జరుగుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *