ఏసీటీవోలకు గెజిటెడ్ హోదా కల్పించాలి

  • సమస్యను చీఫ్ సెక్రటరీ దృష్టికి తీసుకెళ్లిన రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ నీతు కుమారి ప్రసాద్
  • రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ నీతు కుమారి ప్రసాద్ కి వాణిజ్య పన్నుల శాఖ నాన్‌ గెజిటెడ్‌ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మహమ్మద్‌ ముజాహిద్‌ హుస్సేన్‌ ప్రత్యేక కృతజ్ఞతలు

హైదరాబాద్, ఏప్రిల్ 15 (విశ్వం న్యూస్) : తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖలో పనిచేస్తున్న ఏసీటీవోలకు గెజిటెడ్ హోదా కావాలని ఏడు సంవత్సరాల నుండి తిరుగుతూ ప్రతిసారి ఎన్నో రిప్రజెంటేషన్ తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం పక్షాన తెలంగాణ రాష్ట్ర రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ శ్రీమతి నీతు కుమారి ప్రసాద్ ఐఏఎస్ కు ఎన్నోసార్లు కలిసి విన్నవించాను.

ఏసీటీవోలకు గెజిటెడ్ హోదా సోమేశ్ కుమార్ ఉండే వరకు దక్కలేదు, మళ్లీ నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చీఫ్ సెక్రటరీ శ్రీమతి శాంతకుమారి దృష్టికి గురువారం రోజు జరిగిన తెలంగాణ స్టేట్ జాయింట్ కమిషనర్ల సమావేశంలో తెలంగాణ స్టేట్ వాణిజ్య పనుల శాఖలో ఉన్న సమస్యల మీద జరిగిన సమావేశంలో తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్, ప్రభుత్వం చీఫ్ సెక్రటరీ దృష్టికి సమస్య ఏసీటీవోలకు గెజిటెడ్ హోదా చాలా సంవత్సరాల నుండి పెండింగ్లో ఉందని ఆమె దృష్టికి తీసుకొంచారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏసీటీవోలకు గెజిటెడ్ హోదా ఇచ్చి సంవత్సరం అవుతుంది. తెలంగాణ రాష్ట్రంలో వాణిజ్య పనుల శాఖలో పనిచేస్తున్నా ఏసీటీవోలకు గెజిటెడ్ హోదా వెంటనే అమలు చేయండి అని కమిషనర్ చీఫ్ సెక్రటరీ చెప్పటంతో ఆ సమస్య నా దృష్టికి వచ్చింది చూస్తాను. టి సి టి ఎన్జీవోస్ సంఘం పక్షాన కమిషనర్ మేడం దృష్టికి తీసుకొని వెళ్ళి న దానిని కమిషనర్ మేడం గురువారం రోజు జరిగిన చీఫ్ సెక్రటరీ మేడం సమావేశంలో ఏ సీటీవోలకు గెజిటెడ్ హోదా గురించి మన కమిషనర్ శ్రీమతి నీతో కుమారి ప్రసాద్ వారి యొక్క దృష్టికి తీసుకొని వచ్చినందుకు మన కమిషనర్ శ్రీమతి నీతో కుమారి ప్రసాద్ కు తెలంగాణ వాణిజ్య పనుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *