గగనతల దాడులు హేయం : మావోయిస్టు పార్టీ
సరిహద్దుల్లో సీఆర్పీఎఫ్, కోబ్రా, గ్రేహౌండ్స్ మోహరించి ఆదివాసీలపై దాడులను ఖండించండి

తిమ్మాపూర్, జనవరి 12 (విశ్వం న్యూస్) : దేశ సంపద దోచుకుపోయేందుకు దారులు సుగమం చేస్తున్న పాలకులు నిన్న ( బుధవారం )సరిహద్దుల్లో జరిగిన సర్జికల్ స్ట్రైక్ లో మావోయిస్టు నేత బెటాలియన్ కమాండర్ కామ్రేడ్ ఇడ్మ మరణించినట్లు ఇరు రాష్ట్రాల పోలీసులు దేశం అంతా ప్రచారం చేశారు. దాడులు చేసింది నిజమే కానీ వాళ్ళు అనుకున్న లక్ష్యం నెరవేరలేదు. దాడికి మా ప్రజా గెరిల్లా సైన్యం (పీఎల్డీఏ) గట్టి సమాధానం ఇచ్చింది.
నిజంగా దేశ ప్రజలపై ఈ దేశంలో ఉన్న సైన్యం దాడి చేయడం తిరిగి ఆ దాడులను సమర్ధించుకోవడం, సిగ్గులేకుండా దాన్ని గొప్పగా ప్రచారం చేసుకోవడం చూస్తుంటే. ఆశ్చర్యం వేస్తుంది. దేశ భద్రత కోసం దేశాల సరిహద్దుల్లో ఉండాల్సిన సైన్యం ఫర్తీస్ఘడ్ అడవుల్లో ప్రతి నాలుగు ఊళ్ళకు ఒక క్యాంపు పెట్టి ఆదివాసీలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. నిత్యం ఇనుప బూట్ల పదఘట్టనలో ఆదివాసీలు నలిగిపోతున్నారు. ఈ దేశంలో అత్యంత విలువైన సంపద ప్రస్తుతం ఛత్తీస్ఘడ్ దండకారణ్యంలో ఉంది. అనేక రకాల ఖనిజాలు, అటవీ సంపద కొల్లగొట్టేందుకు భహుల జాతి కంపెనీలు పన్నాగం పన్నాయి. మిగతా ప్రాంతాల్లో లాగా ఇక్కడ సంపద దోచుకుపోయేందుకు వీలు పడటంలేదు. ఆదివాసీలను నిత్యం చైతన్యం చేస్తూ వారి సంపద వారికే దక్కాలని మావోయిస్టు పార్టీ కోరుతుంది. ఇది పాలకులకు మింగుడు పడటంలేదు. అందుకు మావోయిస్టు పార్టీని ధ్వంసం చేసేందుకు శత విధాల కుట్రలకు పూనుకుంటుంది.
మొత్తం ఛత్తీస్ఘడ్ రాష్ట్రాన్ని పోలీసు క్యాంపుగా మార్చింది. ఆకు పచ్చ అడవిలో నెత్తుటేరులు పారించేందుకు నిత్యం దాడులు చేస్తుంది. ఆఖరికి వైమానిక దాడులుచేస్తుందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇప్పటికే అనేక మార్లు వైమానిక దాడులకు పూనుకుంది. అనేక సార్లు గ్రామాలపై మోటార్ సెల్స్ వేసింది. వీటన్నిటిని ప్రజలు గమనించాలి. మావోయిస్టు పార్టీని ప్రజల నుంచి వేరు చేసేందుకు సామ దాన భేద దండోపాయాలను ఎంచుకుంది. ఇలాంటి దాడులను ఖండించాలని పిలుపునిస్తున్నాం. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మోడీ, అమిత్ షా లు ఇద్దరూ సామ్రాజ్యవాద ఏజెంట్లుగా పనిచేస్తున్నారు. దేశంలో రాజ్యంగ హక్కులను హరించివేస్తున్నారు. ప్రశ్నించే హక్కు. జీవించే హక్కులను కాలరాస్తున్నారు. -దేశ సంపద కొందరి చేతుల్లో ఉండేందుకు వీలు కలిగేలా చట్టాలను
చేస్తున్నారు.
> సమాధాన ప్రహార్ దాడులను ఖండించండి.
> దేశ ప్రజలపై వైమానిక దాడులు చేయండం హేయమైన చర్య.
>ప్రజలారా మేల్కొనండి, దేశ సంపద కాపాడుకునేందుకు పోరాటాలు చేయండి.
>గ్రీన్ హంట్ కు వ్యతిరేకంగా పోరాడండి.
>దండకారణ్యంలో ఏర్పటు చేసిన సైన్యాన్ని తక్షణం ఉపసంహరించాలి.
> ప్రజా గెరిల్లా సైన్యం వర్ధిల్లాలి..
విప్లవలభినధనలతో
కార్యదర్శి
భద్రాద్రి కొత్తగూడెం-అల్లూరి సీతారామరాజు డివిజన్
కమిటీ (బీకే-ఏఎస్ఆర్)
భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్ట్)