కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్స్ ను పర్మినెంట్ చేయాలి ప్రొఫెసర్ శాంతా సిన్హా

అంబర్పేట్, జనవరి 12 (విశ్వం న్యూస్) : కాంట్రాక్ట్ వ్యవస్థను బలోపేతం చేస్తూ కార్మిక వర్గాన్ని దోచుకుంటున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా విధానాలను వ్యతిరేకిస్తూ బలమైన కార్మిక ఉద్యమాన్ని నిర్మించాలని పద్మ భూషణ్ అవార్డు గ్రహీత,బాల కార్మికుల వ్యవస్థ నిర్మూలన కోసం పోరాడిన ప్రొఫెసర్ శాంతా సిన్హా కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు.
తెలంగాణ ప్రగతిశీల కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్స్ అసోసియేషన్( ఐ ఎఫ్ టి యు) రాష్ట్ర ప్రథమ మహాసభ జనవరి 11నాడు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు. ఈ మహాసభలో ప్రొఫెసర్ శాంతా సిన్హా ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ మహిళా కార్మికుల పట్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇజ్జత్ లేకుండా వ్యవహరిస్తుందని, వారిని అణగదొక్కుతుందని, వారి శ్రమను దోచుకుంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. కే జి బి వి మహిళ వర్కర్స్ పట్ల ఉత్తుత్తి ప్రేమ కాకుండా నిజమైన ప్రేమ చూయించి వారి సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. బాల కార్మికుల నిర్మూలన లో కేజీబీవీలు కృషిచేసినాయి ఆ కృషిలో కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్స్ పాత్ర ముఖ్యమైనదని, వారిని ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం విస్మరిస్తుందని విమర్శించారు. గుర్తింపు కార్డులు, హెల్త్ కార్డులు, పిఎఫ్ ,ఈఎస్ఐ, కనీస భద్రతతో కూడిన హక్కులు లేకుండా కార్మికులతో వెట్టి చేయించుకోవడం దుర్మార్గమైన చర్యని అన్నారు. ఇప్పటికైనా మీ పాలన విధానాలను సమీక్షించుకొని ప్రజలకు కార్మిక వర్గానికి అనుకూలమైన విధానాలను రూపొందించుకోవాలని లేనట్లయితే మీకు రాజకీయ భవిష్యత్తు శూన్యమని అన్నారు.
ఈ మహాసభలో ఐఎఫ్ టి యు రాష్ట్ర అధ్యక్షులు టి శ్రీనివాస్, ఐ ఎఫ్ టి యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్. జనార్ధన్, పిఓడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు జి. ఝాన్సీ, ఐ యఫ్ టి యు రాష్ట్ర ఉపాధ్యక్షురాలు అరుణ, కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు గంట నాగయ్య, ప్రధాన కార్యదర్శి వై. గీత తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమం లో రాష్ట్రంలోని వివిధ జిల్లాల కే జీ బీ వీ నాన్ టీచింగ్ వర్కర్స్ అసోసియేషన్ సభ్యులు అమృత, రఫియా,శ్రీలత, శమంత,అశ్విని,కవిత,రేణుక, సరస్వతి,కల్యాణి,సునీత,ఎల్లమ్మ, నీల బాయ్,పుష్ప, తదితరులు పాల్గొన్నారు.
