అలయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ జిల్లా డైరెక్టరీ ఆవిష్కరణ, మెర్లో సెమినార్

అలయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ జిల్లా డైరెక్టరీ ఆవిష్కరణ, మెర్లో సెమినార్

తిమ్మాపూర్, జనవరి 2 (విశ్వం న్యూస్) : కరీంనగర్ జిల్లా అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ 137/ఏ, వాసుదేవ హాస్పిటల్, అచీవర్స్ స్కూల్ సంయుక్తంగా సోమవారం అలయన్స్ జిల్లా డైరెక్టరీ ఆవిష్కరణ, పిఎస్టి స్కూలింగ్, మెర్లో సెమి నార్ కార్యక్రమాన్ని స్థానిక అచీవర్స్ స్కూల్లో ఘనం గా నిర్వహించారు. మొదటగా జిల్లా అలయన్స్ లీడర్స్ జిల్లా డైరెక్టరీని ఆవిష్కరించిన అనంతరం నూతన క్లబ్ లైన అలయన్స్ క్లబ్ ఆఫ్ జెమ్స్ అల యన్స్ క్లబ్ ఆఫ్ మహా శక్తి (మహిళా క్లబ్ ) ల ప్రమా ణ స్వీకారం, పీఎస్టి ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ ల యొక్క స్కూలింగ్, మెర్లో సెమినార్ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో జిల్లాలో ఉన్న అన్ని క్లబ్ ల ప్రెసిడెం ట్లు, సెక్రటరీలు, ట్రెజరర్లు, జోన్ చైర్మన్లు, రీజనల్ చైర్మన్లు, డిస్ట్రిక్ట్ గవర్నర్, వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్లు, ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్లు సుమారుగా 125 మంది పాల్గొ న్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న ఇంటర్నేషనల్ అడ్వైజర్ డాక్టర్ ఎలగందుల శ్రీనివాస్ గారు మాట్లాడుతూ… స్వదేశీ స్థాయిలో స్థాపించబడి సార్క్ స్థాయిలో విస్తరించిన అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ అతి తక్కువ సభ్యత్వ రుసుము 1000 రూపాయలను కలిగి ఉండి సామా న్యుడికి అందుబాటులో ఉందని అందువల్ల ఈ సంస్థ ను ప్రజలు ఎంతో ఆదరిస్తున్నారని, ఈ సంస్థ స్వదేశీ ది అయినందున డాలర్ ను రూపాయిగా మార్చుకుం టుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ గవర్నర్ గాలిపెల్లి నాగేశ్వర్, వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ I చెరిమల వెంకటేశ్వర్లు – పల్లవి, వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ II డాక్టర్ ఎలగందుల సౌమ్య శ్రీనివాస్, ఇంజనీర్ కోల అన్నారెడ్డి, ఈద కుమారస్వామి, చీకోటి శ్రీనివాస్ గాంధీ, చకిలం స్వప్న శ్రీనివాస్, కొంజర్ల మహేష్, సుద్ద పల్లి ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *