అనాధ పిల్లలకు సేవ చేయడం
అంటే దైవకార్యంతో సమానం

- టిపిసిసి సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి
పీర్జాదిగూడ, జూన్ 5 (విశ్వం న్యూస్) : పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పర్వతాపూర్ పరిది లోని అమ్మ ఒడి వాలంటీర్ ఆర్గనైజేషన్ సంస్థ ఆర్గనైజర్ మోహన్ ఆధ్వర్యంలో సాయి ఐశ్వర్య కాలనీలో అనాధ ఆశ్రమం నిర్వహిస్తున్నారు. ఇటీవల కరెంటు షార్ట్ సర్క్యూట్ వల్ల అనాధాశ్రమంలో చాలా వస్తువులు కాలిపోయి ఆశ్రమంలో ఉంటున్న పిల్లలకు ఇబ్బందులు తలెత్తాయి. స్థానిక పీర్జాదిగూడ కాంగ్రెస్ పార్టీ నాయకులు యువ నేత 3వ డివిజన్ ఇంఛార్జి ఉదయ్ రాజ్ గౌడ్ ఆధ్వర్యంలో విషయం తెలుసుకున్న టిపిసిసి సీనియర్ అధికార ప్రతినిధి, మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కో ఆర్డినేటర్ సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి అమ్మ ఒడి అనాధ ఆశ్రమాన్ని సందర్శించి, అక్కడ జరిగిన ప్రమాద వివరాలను అడిగి తెలుసుకొని నిర్వాహకులకు తన వంతు ఆర్ధిక సహాయం అందించి,పిల్లలతో మాట్లాడి వారికి అవసరమైన ఎగ్జామ్ ప్యాడ్స్, పుస్తకాలు,కంపక్స్ బుక్స్, పెన్నులు, విద్యాసామాగ్రి అందజేసి వారితో కొంతసేపు గడిపి పిల్లలకు పండ్లు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా హరి వర్ధన్ రెడ్డి మాట్లాడుతూ తల్లిదండ్రులు లేని అనాధ పిల్లల బాగోగులు చూడటం దైవకార్యంతో సమానమని, వారికి సేవ చేయాలనే ఆలోచన మోహన్ కి రావడం వారి అదృష్టమని, ఇటువంటి వారికి అందరం చేదోడు వాదోడుగా నిలబడాలని కోరారు.

ఈ అనాధ ఆశ్రమాన్ని పరిశీలించిన వారిలో హరి వర్ధన్ రెడ్డితో పాటు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ బి బ్లాక్ అద్యక్షులు వేముల మహేష్ గౌడ్, ఘనాపూర్ గ్రామ సర్పంచ్ బద్దం గోపాల్ రెడ్డి, ఎస్టీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు నానావత్ సురేష్ నాయక్, వేముల గోవర్ధన్, పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ నాయకులు పన్నాల శ్రీనివాస్ రెడ్డి ,ముదిగొండ రమేష్,యండి మజర్, శ్రీలత భద్రు నాయక్ ,పవన్ గౌడ్, విజయేందర్ రెడ్డి, ఉదయ్ రాజ్ గౌడ్, ఉప్పరి ఉదయ్ కుమార్,సైదా నాయక్, పంగా రాజు , బద్దం సాయిరాం రెడ్డి, అజయ్, జవహర్ నగర్ నాయకులు గజ్వేల్ శంకర్, నర్సింగ్ యువత మహిళలు తదితరులు హాజరయ్యారు.