బీఆర్ఎస్ కు అరూరి రాజీనామా

బీఆర్ఎస్ కు అరూరి రాజీనామా

హైదరాబాద్, మార్చి 16 (విశ్వం న్యూస్) : బీఆర్ఎస్ పార్టీకి వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే, వరంగల్ జిల్లా అధ్యక్షుడు అరూరి రమేశ్ రాజీనామా చేశారు. పార్టీలో అవకాశాలు కల్పించిన పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావుకు ధన్యవాదాలు తెలిపారు.

పార్టీ జిల్లా అధ్యక్ష పదవికి, ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు లేఖ విడుదల చేశారు. తన రాజీనామా ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. ఇన్నాళ్లు తనకు సహకరించిన ప్రతీ ఒక్కరికీ పేరుపేరున కృతజ్ఞతలు తెలిపారు.

ఇక ఆయన ఆదివారం మధ్యాహ్నం బీజేపీలో చేరనున్నారని సమాచారం. వరంగల్ పార్లమెంట్ నుంచి ఆయనను బరిలో నిలిపేందుకు బీజేపీ సైతం సిద్ధంగా ఉండడంతో ఆయన పార్టీ మారుతున్నట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *