కేసీఆర్ నిరుద్యోగ భృతికి అసెంబ్లీ వేదికగా నిధులు కేటాయించాలి

జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం ద్వారా కోరిన జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు పడాల రాహుల్
కరీంనగర్, ఫిబ్రవరి 4 (విశ్వం న్యూస్) : తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు 3016 రూ.ల నిరుద్యోగ భృతి ఇస్తామని 2018 ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా చెప్పిన భరాస వ్యవస్థాపకులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు ఈనెల 6న అసెంబ్లీలో నిరుద్యోగ భృతికి నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరుతూ నేడు కరీంనగర్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు పడాల రాహుల్ గారి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గారికి వ్రాసిన వినతి పత్రం ద్వారా కోరడం జరిగింది.
ఈ సందర్భంగా పడాల రాహుల్ గారు మాట్లాడుతూ..
2018 ఎన్నికల మానిఫెస్టోలో బి.ఆర్.ఎస్.పార్టీ అధినేత, తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు రూ.3016 నిరుద్యోగబృతి ఇస్తామని ప్రకటించి, అధికారంలోకి వచ్చి నాలుగున్నర ఏండ్లు గడిచినప్పటికీ కనీసం నిరుద్యోగులను పట్టించుకోకుండా వారికి తీవ్ర అన్యాయం చేస్తున్నారు. నిరుద్యోగబృతి ఇవ్వడం వల్ల నిరుద్యోగులు పోటీ పరిక్షలకు దరఖాస్తు చేసుకోవడం, శిక్షణ శిబిరాలలో సరైన శిక్షణ తీసుకోవడం, పలు ఉపాధి మార్గాలకు సంబంధించి ఫీజులు చెల్లించడం కొరకు అవకాశం ఉంటుంది. గ్రామీణ ప్రాంతాలలోని నిరుపేద యువకులు ఉన్నత చదువులు చదివినప్పటికీ ఉపాధి వేటకై ఖర్చుల నిమిత్తం తల్లిదండ్రుల పై ఆధారపడవలసి వస్తుంది. పలు సందర్భాలలో ఈ విషయంలో కొంతమంది యువత అవమానంతో ఆత్మహత్యలు చేసుకున్నసంఘటనలు ఉన్నాయి. అందువల్ల ఈ విషయాలను పరిగణలోకి తీసుకొని బి.ఆర్.ఎస్.పార్టీ అధినేత, తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు 2018 ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీమేరకు రూ.3016 నిరుద్యోగబృతి ఇవ్వాలని నేడు అసెంబ్లీలో ప్రవేశ పెట్టనున్న బడ్జెట్ లో నిరుద్యోగబృతికి నిధులు కేటాయించగలరని జిల్లా యువజ కాంగ్రెస్ పక్షాన రాష్ట ప్రభుత్వాన్ని కోరుతూ జిల్లా కలెక్టర్ గారికి రాసిన లేఖను పరిపాలన అధికారి గారికి అందజేయడం జరిగిందని అన్నారు.
ఈ కార్యక్రమంలో కరీంనగర్ అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అబ్దుల్ రెహమాన్, జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కొండ హరీష్, అసెంబ్లీ ప్రధాన కార్యదర్షులు ఖలీం, కిరణ్ యాదవ్ ఎన్.ఎస్.యు.ఐ నాయకులు అనురాగ్ దాసరపు, అభిరాం, తిమ్మాపూర్ మండల ఉపాధ్యక్షుడు మధు యాదవ్, తదితరులు పాల్గొన్నారు.