చిరంజీవితో బండి సంజయ్ భేటీ

హైదరాబాద్, జూన్ 23 (విశ్వం న్యూస్) : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ నేడు హైదరాబాదులో మెగాస్టార్ చిరంజీవి నివాసానికి విచ్చేశారు. చిరంజీవితో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. దీనిపై బండి సంజయ్ సోషల్ మీడియాలో స్పందించారు.

“అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారిని కలవడం ఎప్పుడూ సంతోషదాయకమే. చిరంజీవి గారు వినయశీలి, నా శ్రేయోభిలాషి. నేను విద్యార్థిగా ఉన్నప్పటి నుంచి ఆయన సినిమాలకు అభిమానిని” అంటూ ట్వీట్ చేశారు. చిరంజీవితో భేటీకి సంబంధించిన ఫొటోలను కూడా బండి సంజయ్ పంచుకున్నారు.

అయితే ఆయనకు రాజ్యసభ అవకాశం ఇవ్వాలని కేంద్రం పెద్దలు భావిస్తున్నట్టు కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కూడా చిరంజీవితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఇటీవల, ఏపీ మంత్రివర్గ ప్రమాణస్వీకారోత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీ సైతం స్వయంగా చిరంజీవి వద్దకు వెళ్లి చేయి పట్టుకుని ముందుకు తీసుకువచ్చారు.
