వారసుడు జనవరి 14వ తేదీకి వాయిదా

హైదరాబాద్, జనవరి 9 (విశ్వం న్యూస్) : వారసుడు చివరి నిమిషంలో వాయిదా పడింది. తాజాగా దిల్‌రాజు వారసుడు సినిమాను మూడు రోజులు పోస్ట్ పోన్ చేస్తున్నట్లు ప్రకటించాడు. ఈ సినిమాను జనవరి 14వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ‘వీరసింహా రెడ్డి’, ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలకు ఎక్కువ థియేటర్‌లను కావాలని తనే ఒక అడుగు వెనక్కి వేసినట్లు తెలిపాడు. అయితే తమిళ వెర్షన్ ముందుగా ఫిక్స్ చేసిన తేదీకే రిలీజవుతుందని, కేవలం తెలుగులోనే విడుదల తేదీ మార్పు చేసినట్లు తెలిపారు. అయితే ఎప్పుడు రిలీజైన ‘వారసుడు’ బ్లాక్‌బస్టర్ అవుతుందని తెలిపాడు. కుటుంబ కథా చిత్రమే అయినా ఈ సినిమాలో కొత్త పాయింట్ ఉందని తెలిపాడు. సినిమా చూసి థియేటర్ నుండి బయటకు వచ్చిన తర్వాత అందరూ ఆ పాయింట్‌నే గుర్తు పెట్టుకుంటారని దిల్‌రాజు వెల్లడించాడు. సినిమా 2 గంటల 50 నిమిషాలు(170 నిమిషాలు) రన్‌టైమ్ కలిగి ఉన్నట్లుగా పేర్కొనడం షాక్ ఇస్తోంది. ఇంత లాంగ్ రన్ టైమ్ కలిగి ఉన్న సినిమాలు ఈ మధ్య కాలంలో రావడం లేదనే చెప్పాలి. ఒకవేళ వచ్చినా ఆడియన్స్ సహనానికి పరీక్ష పెడుతూ బాక్సాఫీస్ వద్ద నెగెటివ్ టాక్ తెచ్చుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో మేకర్స్ ‘వారసుడు’ మూవీని లాంగ్ రన్ టైమ్‌తో విడుదల చేయడమంటే సాహసమనే చెప్పాలి. ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు, శిరీష్, నిర్మిస్తున్నారు. ద్విభాషా సినిమాగా రూపొందిన ఈ సినిమాలో విజయ్‌కు జోడీగా రష్మిక మందన్నా నటిస్తుంది. థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా విడుదలతో వీరసింహా రెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలకు ఓపెనింగ్స్ భారీ రేంజ్‌లో వచ్చే అవకాశం ఉంది.