ప్రభుత్వ సలహాదారుగా
కె.కేశవరావు నియామకం

- కేకేకు కాబినెట్ హోదా ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం
హైదరాబాద్, జూలై 6 (విశ్వం న్యూస్) : ప్రభుత్వ సలహాదారుగా కె.కేశవరావును నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పబ్లిక్ అఫైర్స్ సలహాదారుగా కేకేను నియమిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. కేబినెట్ హోదాతో కేకేను సలహాదారుగా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది.
కేకే ఇటీవల దిల్లీలో ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా ఇటీవల తన రాజ్యసభ సభ్యత్వానికి సైతం కేకే రాజీనామా చేశారు.
