మోటార్లు బిగిస్తే కేసులు.. భారీ జరిమానాలు విధిస్తున్న అధికారులు

మోటార్లు బిగిస్తే కేసులు.. భారీ జరిమానాలు విధిస్తున్న అధికారులు

హైదరాబాద్, మే 28 (విశ్వం న్యూస్): జీహెచ్‌ఎంసీ పరిధిలో మంచినీటి అక్రమ వినియోగంపై హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ముఖ్యంగా ఇంటి యజమానులు తాగునీటి పైపులకు మోటార్లు బిగించి నీటిని అధికంగా సేకరించడం, అక్రమ కనెక్షన్ల ద్వారా మంచినీటిని దొంగిలించడం వంటి ఘటనలపై కఠిన చర్యలు చేపడుతున్నారు.

ప్రతి కాలనీలో ప్రత్యేక బృందాలతో అధికారులు ఇంటింటికీ తిరిగి తనిఖీలు నిర్వహిస్తున్నారు. తనిఖీల సమయంలో తాగునీటి పైపులకు మోటార్లు బిగించినట్లు గుర్తిస్తే వెంటనే మోటార్లను స్వాధీనం చేసుకొని సంబంధిత ఇంటి యజమానులపై కేసులు నమోదు చేస్తున్నారు. అదేవిధంగా భారీ జరిమానాలు విధిస్తూ కఠిన హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

ఇక మంచినీటి అక్రమ కనెక్షన్లు, దొంగ కలెక్షన్లపై కూడా అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. అక్రమంగా నీటి కనెక్షన్లు తీసుకొని నీటిని వినియోగిస్తున్న వారిని గుర్తించి ప్రత్యేక సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే పలువురిపై కేసులు నమోదు చేసి భారీగా ఫైన్లు విధించినట్లు సమాచారం.

అధికారులు ప్రజలకు స్పష్టం చేసిన విషయమేమిటంటే — తాగునీరు ప్రజలందరికీ సమానంగా అందేలా సహకరించాలని, అక్రమ పద్ధతుల్లో నీటిని వినియోగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.

కాబట్టి ప్రతి ఇంటి యజమాని జాగ్రత్తగా ఉండాలని, తాగునీటి పైపులకు మోటార్లు బిగించకూడదని, అక్రమ కనెక్షన్లకు దూరంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *