దేశపతిని అభినందించి, శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి కేసీఆర్

హైదరాబాద్, మార్చి 17 (విశ్వం న్యూస్) : శాసనమండలి సభ్యుడిగా ఎన్నికైన సందర్భంగా దేశపతి శ్రీనివాస్ కుటుంబ సభ్యులతో కలిసి, శుక్రవారం ప్రగతిభవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ గారు ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ను అభినందించి, శుభాకాంక్షలు తెలియజేశారు.