అన్నదాత గుండె కోత

అన్నదాతగుండె కోత

బాగా నష్టపోయిన మొక్కజొన్న రైతులు
వీణవంక, మార్చి 17 (విశ్వం న్యూస్) : వీణవంక మండల కేంద్రంలో సుమారుగా 2900 ఎకరాల మొక్కజొన్న పంట వేయడం జరిగింది. నిన్న కురిసిన ఆకాల వడగళ్ల వర్షం వల్ల సుమారుగా 600 ఎకరాల మొక్కజొన్న పంట నష్టం గుర్తించడం జరిగిందని, ఈ విషయంపై అధికారులకు మరియు ప్రభుత్వ దృష్టికి పంపడం జరిగిందని మాకు పై నుండి ఆదేశాలు వచ్చిన వెంటనే సర్వే చేసి నష్టపోయిన రైతుల యొక్క వివరాలను ప్రభుత్వానికి తెలియజేస్తామని వ్యవసాయ అధికారి తెలిపారు. ఇందులో భాగంగా గెల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ అకాలంగా కురిసినటువంటి వర్షానికి వీణవంక మండలంలో లక్ష్మక్కపల్లి గ్రామంలో మొక్కజొన్న పంట భారీగా నష్టం జరిగిందని అలాగే వీణవంక మండలంలో ఉన్న అన్ని గ్రామాల్లో పంట నష్టం జరిగిందని రైతులకు చేతికి అందే టైంలో అపారమైన నష్టం జరిగిందని వడగళ్ల వర్షం వల్ల కడగల్లే మిగిలాయని కావున నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *