అకాల వర్షానికి ఆస్తి నష్టం

అకాల వర్షానికి ఆస్తి నష్టం

వీణవంక, మార్చి 17 (విశ్వం న్యూస్) : కరీంనగర్ జిల్లా వీణవంక మండల కేంద్రంలో నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి గొల్లపల్లి కి చెందిన పారిపల్లి వనమ్మ అనే మహిళ తన ఇంట్లో నిద్రిస్తుండగా రాత్రి కురిసిన భారీ వర్షానికి ఇంటి ప్రక్కన ఉన్న బారి చెట్టు ఇంటి పై పడడంతో ఇల్లు పూర్తిగా దెబ్బ తినడం జరిగింది. అదృష్టవశాత్తు మహిళ కు ఎలాంటి ప్రమాదం జరగలేదు. అలాగే కొండపాక వెళ్ళే దారిలో బారి చెట్టు పడడం వల్ల ప్రయాణికులకు అంతరాయం జరగకుండా దారిలోని వృక్షాన్ని ప్రక్కకు తోలిగించడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *