క్రీడల వల్ల ఆత్మస్తయిర్యంతో పాటు మానసిక ఉల్లాసం : నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి

క్రీడల వల్ల ఆత్మస్తయిర్యంతో పాటు మానసిక ఉల్లాసం : నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి

ముగిసిన ఫ్రెండ్స్ క్రికెట్ టోర్నమెంట్ పోటీలు
విజేతలకు బహమతులు ప్రదానం చేసిన కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి
కరీంనగర్, ఫిబ్రవరి 11 (విశ్వం న్యూస్) : అయిదు రోజులపాటు పదకొండు జట్లు బొమ్మకల్ లారీ అసోసియేషన్ ఎదురుగా ఉన్న మైదానంలో హోరా హోరీగా తలపడగా శనివారం ఫైనల్ మ్యాచ్ లు ముగిసినవి విన్నర్ రన్నర్స్ కు నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని బహుమతులు ప్రదానం చేశారు, ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ క్రీడల వల్ల ఆత్మస్తయిర్యంతో పాటు మానసిక ఉల్లాసం కలుగుతుందన్నారు, రాష్ట్ర స్థాయిలో అడే విధంగా తయరవ్వాలని అందుకు మావంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు. విన్నర్ టీం సాహిల్ 11, రన్నర్ టీం ముకయ్యర్ 11 కు కప్పులతో పాటు చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. సయ్యద్ ఖాజా నాయాబ్, సయ్యద్ ముకయ్యర్ ఆధ్వర్యంలో టోర్నమెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గుండాటీ శ్రీనివాస్ రెడ్డి, షేక్ షేహెన్షా, మాసుంఖాన్, నదిo, కమల్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *