ముగిసిన ఫార్ములా ఈ కార్ రేసు

హైదరాబాద్, ఫిబ్రవరి 11 (విశ్వం న్యూస్) : వరల్డ్ ఛాంపియన్ షిప్ ఫార్ములా ఈ రేసులో భాగంగా సాగరతీరాన నిర్వహించిన రేసు విజయవంతంగా ముగిసింది. ఈ రేసులో జీన్ ఎరిక్ విన్నర్‌గా నిలిచారు. రెండో స్థానంలో నిక్ క్యాసిడీ, మూడో స్థానంలో సెబాస్టియన్ బ్యూమీ నిలిచారు. ఈ సందర్భంగా విన్నర్‌కు మంత్రి కేటీఆర్ బహుమతి అందజేశారు. హైదరాబాద్‌లోని సాగరతీరంలో నిర్వహించిన ఫార్ములా ఈ కారు రేసును ఏపీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ వీక్షించారు. ఈ సందర్భంగా రేస్ కోసం తెలంగాణ ప్రభుత్వం చేసిన ఏర్పాట్లను ఆయన మెచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఏపీ మంత్రి అమర్‌నాథ్ మాట్లాడుతూ.. హైదరాబాద్‌కు అంతర్జాతీయ గుర్తింపు రావడం గర్వకారణమని కొనియాడారు.


