కామ్రేడ్‌ బుక్కరాజు తిరుపతి యాదవ్‌ స్మారక సంతాప సభ

కామ్రేడ్‌ బుక్కరాజు తిరుపతి
యాదవ్‌ స్మారక సంతాప సభ

సూర్యాపేట/పనిగిరి, నవంబర్‌ 1 (విశ్వ న్యూస్) : తుంగతుర్తి నియోజకవర్గంలోని నాగారం మండల పరిధిలోని పనిగిరి గ్రామంలో సామాజిక బహుజన విప్లవకారుడు కామ్రేడ్ బుక్కరాజు తిరుపతి యాదవ్ గారి స్మారకార్థం సంతాప సభను బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు తన్నీరు రామ్ ప్రభు పాల్గొని, తిరుపతన్న చిత్రపటానికి పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు.

సభలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొని తిరుపతన్న సేవా స్ఫూర్తిని స్మరించారు. తిరుపతన్న బహుజన సమాజ అభ్యున్నతికి చేసిన కృషి, సామాజిక సమానత్వం కోసం ఆయన సాగించిన పోరాటం గురించి ప్రసంగించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *