ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్న కార్పోరేటర్ పద్మా వెంకట్ రెడ్డి

ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్న కార్పోరేటర్ పద్మా వెంకట్ రెడ్డి

అంబర్ పేట, జనవరి 28 (విశ్వం న్యూస్): బాగ్ అంబర్పేట్ డివిజన్ కార్పొరేటర్ పద్మ వెంకట్ రెడ్డి ,జిహెచ్ఎంసి ఎఇ కిషోర్ , వర్క్ ఇన్స్పెక్టర్ రవి నాయక్, డ్రైనేజ్ సూపర్వైజర్ లక్ష్మణ్ తో కలిసి ప్రజా సమస్యలు తెలుసుకుంటూ తురాబ్ నగర్ బస్తీలో పర్యటించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ పద్మ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ తురాబ్ నగర్ బస్తీలో సిమెంటు రోడ్డు వేసిన తర్వాత డ్రైనేజీ మాన్యువల్ హోల్స్ దగ్గర ఏర్పడ్డ గ్యాప్ వలన భూమిలోనుండి డ్రైనేజీ నీళ్లు ఇండ్లలో ఉన్న బోరింగ్ లోకి నీళ్లు వెళ్లి కలుషిత నీళ్లు వస్తున్నాయని , మంచినీటి సంపులు కూడా కలుషితమవుతున్నాయని, తక్కువ ఒత్తిడితో వచ్చే మంచినీళ్లు కూడా కలుషిత నీళ్లు రావడం వలన తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ప్రజలు తన దృష్టికి తీసుకువచ్చారని ఈ సమస్యలను వాటర్ వర్క్స్ అధికారులు వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. అదేవిధంగా పాడైపోయిన వర్షం నీటి మ్యానువల్ కవర్స్ కట్టించాలని, గుర్తించిన ప్యాచ్ వర్క్ లను వెంటనే పూర్తి చేయాలని జిహెచ్ఎంసి అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జోగులాంబ గద్వాల జిల్లా బిజెపి ఇన్చార్జ్ వెంకట్ రెడ్డి , హైదరాబాద్ సెంట్రల్ జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ గౌడ్, డివిజన్ బిజెపి అధ్యక్షులు చుక్క జగన్, ప్రధాన కార్యదర్శి జెమ్మిచెట్టు బాలరాజ్,బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *