ఎమ్మెల్యే డా.రసమయికు వినతిపత్రం అందజేసిన వివోఏ లు

తిమ్మాపూర్, జనవరి 28 (విశ్వం న్యూస్): వివోఏ లు తమ సమస్యలు పరిష్కరించాలంటూ శనివారం కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర సాంస్కృతిక సారధి చైర్మన్, శాసనసభ్యులు డా.రసమయి బాలకి షన్ కు వినతి పత్రాన్ని సమర్పించిన మానకొండూర్ నియోజకవర్గంలోని వివోఏలు, స్వతంత్ర యూనియన్, గ్రామ సామాజిక కార్యకర్తలు. ఈ సందర్భంగా వెం టనే స్పందించిన ఎమ్మెల్యే డా. రసమయి వివోఏ ల డిమాండ్లు, సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి, పరిష్కరించే విధంగా కృషి చేస్తానని హామి ఇచ్చారు.