
- ఆర్టికల్ 142 కింద వారికి విడాకులు మంజూరు చేయవచ్చు
- భార్యాభర్తలు విడాకుల మాట పైనే ఉంటే వెంటనే విడాకులు
ఢిల్లీ, మే 1 (విశ్వం న్యూస్) : విడాకుల విషయంలో సర్వోన్నత న్యాయస్థానం చరిత్రాత్మక తీర్పును వెలువరించింది. విడాకుల ప్రక్రియ మరింత సులభతరం చేస్తూ తీర్పునిచ్చింది. పునరుద్దరించలేని విధంగా దెబ్బతింటే విడాకుల కోసం సుదీర్ఘ న్యాయ విచారణకు కుటుంబ న్యాయస్థానాలకు పంపకుండా రద్దు చేయవచ్చని తెలిపింది.
భార్యాభర్తలు ఇద్దరు కోరుకుంటే వెంటనే విడాకులు తీసుకోవచ్చని.. విడాకులకు 6 నెలల నిబంధన అవసరంలేదని స్పష్టం చేసింది. ఆర్టికల్ 142ను సవరించిన సుప్రీం కోర్టు… ఇకపై సత్వరంగా విడాకులు
పొందే వీలు.