ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దగ్ధం

ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దగ్ధం

నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు

గోవిందరావుపేట, మార్చి 25 (విశ్వం న్యూస్) : కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయడానికి నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ గోవిందరావుపేట మండల కమిటీ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ ను దగ్ధం చేశారు. మండల కేంద్రంలో రాస్తారోకో నిర్వహించారు. అనంతరం మండల వర్కింగ్ ప్రెసిడెంట్ సీతారాం నాయక్ మాట్లాడుతూ భారత్ జూడో యాత్ర ద్వారా రాహుల్ గాంధీకి వస్తున్న ఆదరణ సూసి ఓర్వలేక బిజెపి ప్రభుత్వం రాహుల్ గాంధీ ని అక్రమ కేసులు బనాయించి పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేసిందని ఆరోపించారు.

దేశంలో నిరవ మోడీ విజయ మాల్యా ఆదానిలకు దేశ సంపద కట్టబెడుతున్నారని విమర్శించారు దేశ ప్రజల హక్కుల కోసం కేంద్ర నియంతృత్వ పోగడలకు వ్యతిరేకంగా పోరాడుతున్న రాహుల్ గాంధీ సభ్యత్వం రద్దు చేయడం బిజెపి ప్రభుత్వం దివాలా తనానికి నిదర్శనమని భుజమెత్తారు ఇప్పటికైనా ఇలాంటి విధానాలు మానుకోవాలని లేనట్లయితే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సహకార సంఘం అధ్యక్షుడు ఎల్లారెడ్డి ఎస్ఎస్సి జిల్లా అధ్యక్షుడు దాసరి సుధాకర్ జంపాల ప్రభాకర్ ముఖ్య సారయ్య కణతల నాగేంద్రరావు ఎంపీటీసీలు ఏడుకొండలు నాగలక్ష్మి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *