ఎస్సీ వర్గీకరణ బిల్లును
పార్లమెంటులో ఆమోదించాలి
ఎం ఎస్ పి ఉమ్మడి జిల్లా ఇంచార్జ్ మందకుమార్ మాదిగ
వరంగల్ బ్యూరో, మార్చి 25 (విశ్వం న్యూస్) : ఎస్సీ వర్గీకరణ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆమోదించే వరకు పెద్ద ఎత్తున ఉద్యమించాలని ఎం ఎస్ పి ఉమ్మడి జిల్లా ఇంచార్జ్ నందకుమార్ మాదిగ పిలుపునిచ్చారు. శనివారం ములుగు జిల్లా విస్తృత స్థాయి సమావేశం జరిగింది ఈ సమావేశాన్ని ఉద్దేశించి మంద కుమార్ మాదిగ మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చేపడతామని హామీ ఇచ్చి విస్మరించారని విమర్శించారు.
కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు కిషన్ రెడ్డి సుష్మా స్వరాజ్ నారాయణస్వామి., మురుగన్ మాజీ ఉప ప్రధాని అద్వానీ తదితరులు హామీ ఇచ్చి ఎస్సీలను మోసగించారని మండిపడ్డారు. అందుకోసం మాదిగలు వర్గీకరణ సాధించేంతవరకు ఉద్యమించాలని ఈనెల 31న కలెక్టర్ కార్యాలయం ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయాలని కోరారు ఈ సమావేశంలో ములుగు జిల్లా ఇన్చార్జి ఈరుగు పైడి మాదిగ, జున్ను రవి మాదిగ రాష్ట్ర నాయకుడు నెమలి నరసయ్య మాదిగ, మడిపల్లి శ్యామ్, బలరాం, మరాటి రవీందర్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
