హైదరాబాద్

మేడిపల్లి మండల జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల కోసం కృషి:డిడిఆర్

మేడిపల్లి మండల జర్నలిస్టులకు
ఇండ్ల స్థలాల కోసం కృషి:డిడిఆర్

  • మేడ్చల్ జిల్లా గ్రంధాలయల సంస్థ చైర్మన్ దర్గా దయాకర్ రెడ్డి
  • మంత్రి మల్లారెడ్డి సహకారంతో జర్నలిస్టులకు ఫ్లాట్ల సాకారం

హైదరాబాద్, జూలై 8 (విశ్వం న్యూస్) : మేడ్చల్ మల్కాజిరి జిల్లా మేడిపల్లి మండలం జర్నలిస్టుల సమస్యల కోసం నిరంతరం కృషి చేస్తానని మేడ్చల్ జిల్లా గ్రంధాలయాల సంస్థ చైర్మన్ దర్గా దయాకర్ రెడ్డి అన్నారు.మేడిపల్లి మండల ప్రింట్ మీడియా ప్రెస్ క్లబ్ టీయూడబ్ల్యుజే (ఐ.జే.యు) నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులను మేడ్చల్ జిల్లా గ్రంధాలయాల సంస్థ చైర్మన్ దర్గా దయాకర్ రెడ్డి శనివారం నాడు ఆయన కార్యాలయంలో జర్నలిజం పుస్తకం,పెన్ను ఇచ్చి శాలువాతో ఘనంగా సన్మానించారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని అన్నారు.తన వంతుగా జర్నలిస్టులకు సహాయ సాకారాలు అందిస్తూ ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని అన్నారు.ఈ కార్యక్రమంలో పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షుడు చింతల నర్సింహ రెడ్డి,ప్రదాన కార్యదర్శి పాశం రాజు యాదవ్, బోయిన్ పల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ దేశగోని శ్రీనివాస్ గౌడ్, దేవిసింగ్ నాయక్, శ్రీను నాయక్, మేడిపల్లి మండల ప్రింట్ మీడియా ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *