తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల కమిటీ..
29 మంది కీలక నేతలకు చోటు

హైదరాబాద్, జూలై 20 (విశ్వం న్యూస్) : తెలంగాణకు అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతోంది. దీంతో అన్ని పార్టీలు ఎన్నికలకు సమాయత్తం అవుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో ఎలాగైనా గెలవాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ పని చేస్తోంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ అధిష్ఠానం కీలక నిర్ణయం తీసకుంది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రత్యేకంగా ఎన్నికల కమిటీని ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ప్రకటించింది.
రేవంత్‌రెడ్డి ఛైర్మన్‌గా వ్యవహరించనున్న 2023 రాష్ట్ర ఎన్నికల కమిటీలో 26 మంది సభ్యులు, మరో ముగ్గురు ఎక్స్‌అఫిషియో సభ్యులను అధిష్ఠానం నియమించింది. మొత్తం 29మంది కీలక నేతలకు ఈ కమిటీలో చోటు లభించింది..
తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల
కమిటీ సభ్యులు వీరే:
చైర్మన్:రేవంత్ రెడ్డి, సభ్యులు:భట్టి విక్రమార్క మల్లు, తాటిపత్రి జీవన్‌రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, జగ్గారెడ్డి, గీతారెడ్డి, మహ్మద్ అజారుద్దీన్, అంజన్ కుమార్ యాదవ్, జానారెడ్డి, వి.హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ, మధుయాష్కీ గౌడ్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, చల్లా వంశీ చంద్ రెడ్డి, ఎస్.ఏ సంపత్ కుమార్, రేణుకా చౌదరీ, పోరికా బలరాం నాయక్, పొడెం వీరయ్య, సీతక్క, మహ్మద్ అలీ షబ్బీర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రేమ్‌సాగర్ రావు, ఎం.సునీతారావు ఉన్నారు.
ఎక్స్ ఆఫీషియో సభ్యులు: ఈ ఎన్నికల కమిటీలో రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఎన్ఎస్ యూ ఐ అధ్యక్షుడు, సేవాదళ్ చీఫ్ అర్గైనైజర్స్ కు ఎక్స్ ఆఫీషియో సభ్యులుగా అవకాశం కల్పించారు.