కోరపల్లిలో కంటి వెలుగు

కోరపల్లిలో కంటి వెలుగు

శిబిరాన్ని ప్రారంబించిన సర్పంచ్
గిరవేని రమ-పాల్గొన్న ఎం.పి.టి.సి మమత
జమ్మికుంట, ఏప్రిల్ 27 (విశ్వం న్యూస్) : జమ్మికుంట మండలంలోని కోరపల్లి గ్రామంలో ఈరోజు కంటి వెలుగు శిబిరాన్ని గ్రామ సర్పంచ్ శ్రీమతి గిరవేణి రమ ప్రారంభించారు. ఈ సందర్భంగా వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్” సనా జవేరియా మాట్లాడుతూ 18 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరు కంటి పరీక్షలు చేసుకోవాలని, కంటి వెలుగు శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని గ్రామస్తులకు సూచించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో క్యాంపు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ హిమబిందు, ఎంపీటీసీ కడవేరుగు మమత, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ శంకర్ రెడ్డి, ఉపసర్పంచ్ గిరవేణి ఓదెలు, సూపర్వైజర్ సాంబయ్య, సుస్మిత ఆప్టోమెట్రిస్ట్, ప్రవీణ్ డాటా ఎంట్రీ ఆపరేటర్, ఆరోగ్య శాఖ సిబ్బంది రజిత మరియు ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *