
- ఈనెల 11న భద్రాచలంలో ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, మార్చి 8 (విశ్వం న్యూస్) : ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లబ్ధిదారులకు రూ.5లక్షల ఆర్థిక సాయాన్ని నాలుగు దశల్లో ఇవ్వాలని డిసైడ్ అయింది. నిర్మాణ దశ, ఆధార్ కార్డు ఆధారంగా బ్యాంకు అకౌంట్లకు నేరుగా నిధులను ప్రభుత్వం విడుదల చేయనుంది.
స్థలమున్న వారికి ఇంటి నిర్మాణానికి రూ.5లక్షలు, ప్రతి ఏడాది 4.50 లక్షల ఇళ్లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ కు 3,500 చొప్పున మొత్తం 119 నియోజకవర్గాలకు 4,16,500 ఇళ్లు కేటాయించనుంది. మిగిలిన ఇళ్లను రాష్ట్ర రిజర్వు కోటా కింద ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఆర్థిక సాయం ఇలా..
పునాది స్థాయిలో రూ.లక్ష
రూఫ్ స్థాయిలో రూ.లక్ష
ఇంటి పై కప్పు నిర్మాణం పూర్తయిన తర్వాత రూ.2లక్షలు
నిర్మాణం మొత్తం పూర్తయ్యాక రూ.లక్ష చొప్పున చెల్లించనుంది.
అర్హులు వీరే…
రేషన్ కార్డు ఆధారంగా లబ్ధిదారుడి ఎంపిక
లబ్ధి దారుడు విధిగా బీపీఎల్ (దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారై ఉండాలి, లబ్ధి దారుడికి సొంత స్థలం ఉండాలి. లేదా ప్రభుత్వం స్థలం ఇచ్చి ఉండాలి వివాహమై ఉమ్మడి కుంటుంబంలో ఉంటున్నా లబ్ధిదారుడిగా ఎంపిక కావచ్చు. అద్దె ఇంట్లో ఉంటున్నా లబ్ధిదారుడు కావచ్చు.
సింగిల్ ఉమెన్, వితంతువు మహిళలు లబ్ధిదారులు కావచ్చు
గుడిసె, గడ్డితో పైకప్పు నిర్మించిన ఇల్లు, మట్టి గోడలతో నిర్మించిన ఇల్లున్నా ఈ పథకానికి అర్హలే.
ఇక, ఇందిరమ్మ ఇళ్లను మహిళల పేరు మీదనే మంజూరు చేయనున్నారు.